Site icon NTV Telugu

Vijay Deverakonda Leaks: మీ ఆత్రుత అర్ధమైంది.. ఆగండ్రా బాబూ!

Vd 12 Team

Vd 12 Team

VD 12 Team Asks not to Share Vijay Deverakonda Leaks in Social Media: విజయ్ దేవరకొండ ప్రస్తుతానికి గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో తన 12వ సినిమా చేస్తున్నాడు. ఇంకా పేరు ఫిక్స్ చేయని ఈ సినిమాని వీడి 12 అనే పేరుతో సంబోధిస్తున్నారు. అయితే ఈ సినిమాకి సంబంధించిన లుక్స్ అంటూ విజయ్ దేవరకొండకు సంబంధించిన కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ క్రమంలో సినిమా యూనిట్ తాజాగా ఈ విషయం మీద స్పందించింది. ఈ మేరకు ఒక అఫీషియల్ అప్డేట్ ని కూడా రిలీజ్ చేసింది. డియర్ రౌడీ ఫ్యాన్స్, మాకు మీ ఆసక్తి, ఆత్రుత అర్థమవుతుంది. కానీ వీడి 12 టీం మీరు మరిచిపో లేని ఒక అద్భుతమైన థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడం కోసం చాలా కష్టపడుతోంది. ఇప్పటిదాకా సినిమాకి సంబంధించిన 60 శాతం షూటింగ్ పూర్తయింది.

The Raja Saab: వచ్చే నెల నుంచి రాజా సాబ్!!

ప్రస్తుతం సినిమాని శ్రీలంకలో షూట్ చేస్తున్నాము. గత ఆరు నెలలుగా అన్ని విషయాలను చాలా లో ప్రొఫైల్ గా ఉంచడానికి మేము కష్టపడుతున్నాం. ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేసేందుకు ఆ లుక్ ని దాచడం కోసం చాలా కష్టపడుతున్నాం. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే లీక్స్ ని షేర్ చెయ్యొద్దు అని అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం వెయిట్ చేయాల్సిందిగా కోరుతున్నాం అంటూ ఒక లేఖ లాంటి దాన్ని సోషల్ మీడియాలో రిలీజ్ చేసింది. అయితే ఆ లీక్స్ సినిమాలోని వేనా? లేక సినిమాకి సంబంధించినవి కావా? అనే విషయం మీద మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. తాము ఇచ్చే ఫస్ట్ లుక్ ఎక్స్పీరియన్స్ కి ఇప్పుడు వైరల్ అవుతున్న ఫోటోలు ఇబ్బందికరం కాబట్టి వాటిని షేర్ చేయొద్దని మాత్రం కోరింది.

Exit mobile version