NTV Telugu Site icon

VarunTej : మట్కా కోసం 4 రకాల డబ్బింగ్.. వరుణ్ తేజ్ కష్టం ఫలించేనా..?

Matka

Matka

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’ . వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మిస్తున్నారు. పలాస, శ్రీదేవి సోడాసెంటర్ వంటి సినిమాలు తెరకెక్కించిన కరుణ కుమార్  ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ టీజర్, ఫస్ట్, సెకండ్ సింగిల్స్ హ్యుజ్ బజ్ క్రియేట్ చేశాయి.  ఇటీవల  మెగాస్టార్ చిరంజీవి విడుదల చేసిన ‘మట్కా’ టీజర్ తో సినిమాపై అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. హిట్టు కళ కనిపిస్తోందంటూ కామెంట్స్ చేశారు నెటిజన్స్.

Also Read : Pushpa – 2 : ‘కిస్సిక్’ స్పెషల్ సాంగ్ ఫోటో లీక్

తాజగా ఈ సినిమా డబ్బింగ్ ను ఫినిష్ చేసాడు హీరో వరుణ్ తేజ్.ఈ చిత్రంలో నాలుగు డిఫ్రెంట్ గెటప్స్ లో అలాగే నాలుగు వేరు వేరు వయసు కలిగిన పాత్రల్లో వరుణ్ కనిపిస్తాడు. దీంతో దడబ్బింగ్ కూడా నాలుగు వేరియేషన్స్ లో నాలుగు వివిధ రకాల మాడ్యులేషన్ లో చెప్పాడట మెగా ప్రిన్స్. మట్కా కోసం 4 రకాల మాడ్యులేషన్ తో డబ్బింగ్ చెప్పిన విధానం గురించి ఇండస్ట్రీలో చర్చించుకుంటున్నారు. ఒక్కో వేరియేషన్ కు ఒక్కోలాగా, దర్శకుడు కోరిన విధంగా తాన పాత్రకు సరిగ్గా సరిపోయేట్టు చెప్పిన విధానం తెరపై చూసినప్పుడు ప్రేక్షకులు వరుణ్ తేజ్ కష్టానికి, డేడికేషన్ ను మెచ్చుకుంటారని యూనిట్ భావిస్తోంది. వరుణ్ తేజ్ డబ్బింగ్ కంప్లిట్ చేసిన వీడియోను రిలీజ్ చేసారు మేకర్స్. నవంబరు 14న రిలీజ్ కానున్న మట్కా సూపర్ హిట్ సాధించి వరుణ తెజ్ ను మళ్ళి సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందని ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు.

Show comments