Site icon NTV Telugu

ఫైనల్ షెడ్యూల్ స్టార్ట్ చేసిన వరుణ్ తేజ్

Varun Tej's Ghani final shoot schedule in progress

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మొదటిసారిగా స్పోర్ట్స్ డ్రామా “గని” చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో భారీ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం గురించి వరుణ్ తేజ్ బాగానే కష్టపడుతున్నాడు. సినిమాలో తగిన మేకోవర్ కోసం జిమ్ లో కసరత్తులు చేసి కండలు పెంచేశాడు. అంతేకాదు బాక్సింగ్ కోసం ప్రత్యేకంగా ట్రైనింగ్ కూడా తీసుకున్నాడు. ఇక ఈ సినిమాలో యాక్షన్ సీన్ల కోసం ఏకంగా విదేశీ స్టంట్ మాస్టర్స్ ను రంగంలోకి దించుతున్నారు. హాలీవుడ్ యాక్షన్ కొరియోగ్రాఫర్స్ లార్నెల్ స్టోవల్, వ్లాడ్ రింబర్గ్ సినిమాలో భాగం కావడం ఆసక్తిని పెంచేసింది.

Read Also : ట్రెండింగ్ లో “బాయ్ కాట్ తూఫాన్” !

కిరణ్ కొర్రపాటి దర్శకత్వం వహిస్తున్న “గని” చిత్రాన్ని అల్లు బాబీ సహకారంతో రెనైస్సెన్స్ పిక్చర్స్ బ్యానర్‌పై సిద్ధు ముద్దా నిర్మిస్తున్నారు. అల్లు అరవింద్ దీనిని సమర్పిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన తాజా అప్డేట్ ను మేకర్స్ ప్రకటించారు. అందులో వరుణ్ తేజ్ సినిమా ఫైనల్ షెడ్యూల్ ను ప్రారంభినట్టుగా తెలిపారు. ఇక ఈ షెడ్యూల్ లో క్లైమాక్స్ ను చిత్రీకరిస్తున్నారు. “గని” కోసం నిర్మించిన భారీ సెట్లలో సూపర్ యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కనున్నాయట. ‘దబాంగ్’ ఫేమ్ సాయి మంజ్రేకర్ ఈ చిత్రంతో హీరోయిన్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది.

Exit mobile version