NTV Telugu Site icon

Matka : ‘వరుణ్ తేజ్’ మేల్కోవాల్సిన టైమ్ వచ్చిందా..?

Varuntej

Varuntej

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ మోస్ట్ ఎవైటెడ్ మూవీ ‘మట్కా’. కరుణ కుమార్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని వైర ఎంటర్‌టైన్‌మెంట్స్, SRT ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై డాక్టర్ విజయేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి హై బడ్జెట్ తో నిర్మించారు. మీనాక్షి చౌదరి, నోరా ఫతేహి హీరోయిన్స్ గా నటించారు. కంగువతో పాటుగా ఈ గురువారం విడుదలయింది మట్కా. కానీ మట్కా కంటే కంగువకె ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయి.

Also Read : Pongal Movies : సంక్రాంతి సినిమాల రిలీజ్ లెక్క తేలింది..!

తాజగా విడుదలైన మట్కా మొదటి ఆట నుండి మిశ్రమ స్పందన తెచ్చుకుంది. దాంతో ఆ ప్రభావం కలెక్షన్స్ పై పడింది. ఓవర్సీస్ లో అయితే మట్కా కలెక్షన్స్ మరీ దారుణంగా ఉన్నాయి. వరుణ్ తేజ్ సినిమాకు కనీసం మినిమం ఓపెనింగ్ కూడా రాలేదు అంటే జాగ్రత్తపడాల్సిన టైమ్ వచ్చిందని అర్ధం చేసుకోవాలి. రిలీజ్ రోజు కలెక్షన్స్ కేవలం లక్షల్లో గ్రాస్ వచ్చిందంటే పరిస్థితి ఎలా ఉందొ వరుణ్ తేజ్ చూసుకోవాలి. కెరీర్ మొదట్లో చేసిన ఫిదా, తొలిప్రేమ సూపర్ హిట్స్ మాత్రమే కాకుండా బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ తెచ్చాయి. ఆ తర్వాత మాస్ ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూ  చేసిన మిస్టర్, లోఫర్, ఘని, గాండీవదారి అర్జున, ఆపరేషన్ వాలంటైన్ వేటికవే బీభత్సమైన ప్లాప్స్. మధ్యలో వచ్చిన గద్దల కొండా గణేష్ కాస్త రిలీఫ్ ఇచ్చినా అది రీమేక్ . తాజగా వచ్చిన మట్కా ఫైనల్ రన్ లక్షల్లో  ముగిసేలా ఉంది. మెగా ఫ్యామిలీ స్టాంప్ ఉన్నా కూడా ఈ విధమైన కలెక్షన్స్ హీరో కెరీర్ కు అంత మంచిది కాదు. దాదాపు రూ. 50 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా కోటి రాబట్టలేదు అంటే వరుణ్ తేజ్ కు డేంజర్ బెల్స్ మోగినట్టే. ముందు అర్జెంట్ గా డీసెంట్ హిట్ సినిమా ఒకటి పడాలి లేదంటే అంతే సంగతులు.

Show comments