Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Daisy Edgar-Jones to Act in Mahesh Babu’s Varanasi: సూపర్‌స్టార్ మహేష్‌బాబు హీరోగా, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’. బాబు, జక్కన్న కాంబినేషన్లో వస్తున్న తొలి సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ వరల్డ్ కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో మహేష్‌కు జోడీగా గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా నటిస్తుండగా.. మలయాళ స్టార్ పృథ్వీరాజ్ సుకుమారన్ కీలకమైన ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. తాజాగా ఈ సినిమాలో ఓ హాలీవుడ్ స్టార్ హీరోయిన్ కూడా భాగం అయ్యారనే వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.
బ్రిటీష్ నటి డైసీ జెస్సికా ఎడ్గర్ జోన్స్ ‘వారణాసి’లో నటిస్తున్నారనే ప్రచారం ప్రస్తుతం జోరుగా సాగుతోంది. అంతేకాదు సినిమాలో మహేష్ బాబు, డైసీ మధ్య కొన్ని రొమాంటిక్ సన్నివేశాలు ఉండనున్నాయని, వీరిద్దరి కెమిస్ట్రీ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ విషయంపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. గతంలో జక్కన్న తెరకెక్కించిన గ్లోబల్ బ్లాక్‌బస్టర్ ‘ఆర్ఆర్ఆర్’లో జూనియర్ ఎన్టీఆర్ సరసన జెన్నీ పాత్ర కోసం ఆమెను తొలుత ఎంపిక చేసినట్లు వార్తలు వచ్చాయి. అయితే వ్యక్తిగత కారణాలు, డేట్స్ సమస్యల కారణంగా ఆమె ఆ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారని సమాచారం. ఆ తర్వాత ఆ పాత్రను ఒలివియా మోరిస్ పోషించారు.
Also Read
ఒకవేళ ఈ వార్త నిజమైతే.. వారణాసి ద్వారా ఎస్ఎస్ రాజమౌళి సినిమాలో డైసీ ఎడ్గర్ జోన్స్‌కి మరో అవకాశం వచ్చినట్టే. అయితే డైసీ పాత్ర ఏంటి?.. మహేష్ బాబు, ఆమెకు మధ్య ఎలాంటి ట్రాక్ ఉంటుంది?.. వీరిద్దరి మధ్య నిజంగానే రొమాంటిక్ సన్నివేశాలు ఉంటాయా? వంటి విషయాలపై అభిమానులు ఆసక్తిగా ఉన్నారు. ఇప్పటికే భారీ తారాగణం, రాజమౌళి దర్శకత్వం, మహేష్ క్రేజ్‌తో వారణాసిపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజాగా హాలీవుడ్ నటి పేరు తెరపైకి రావడంతో ఈ సినిమాపై ఆసక్తి మరింత పెరిగింది.
తాజావార్తలు
-
Varanasi Update: ‘వారణాసి’లో హాలీవుడ్ స్టార్ హీరోయిన్.. మహేష్ బాబుతో రొమాంటిక్ సీన్స్!
-
BJP: ‘‘ఓట్లు పోతాయనే స్మిత్ మచ్చర్‌పై మౌనం’’.. కాంగ్రెస్‌పై బీజేపీ విమర్శలు
-
Supreme Court Jobs 2026: సుప్రీంకోర్టులో ఉద్యోగాలు.. గ్రాడ్యుయేట్లకు బంపర్ ఛాన్స్.. ప్రారంభ జీతం రూ.35,400!
-
Flydubai Attack: ‘‘ఇంకా ముగియలేదు’’.. అమెరికా, ఇజ్రాయిల్ విమానాలపై అల్‌ఖైదా టార్గెట్.!
-
world of Bhogi : రా, రస్టిక్ అవతార్‌లో శర్వానంద్.. ‘భోగి’ టీజర్ రిలీజ్
ట్రెండింగ్
-
Shreyas Iyer: పాకిస్థాన్ బ్యాటర్లు భయపెట్టారు.. గోల్డ్ మెడల్ పోతుందనుకున్నా.. అతడే కాపాడాడు!
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!