Varanasi Update: ‘వారణాసి’ నుంచి మరో బిగ్ ట్రీట్‌.. మళ్లీ అప్పుడే ప్లాన్ చేశారా?

Varanasi Mahesh Babu

Varanasi Mahesh Babu

Varanasi Movie Update: సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు హీరోగా, దర్శకధీరుడు ఎస్‌ఎస్‌ రాజమౌళి తెరకెక్కిస్తున్న గ్లోబల్‌ అడ్వెంచర్‌ మూవీ ‘వారణాసి’. 2027 ఏప్రిల్‌ 7న ప్రేక్షకుల ముందుకు రానుంది. మహేశ్‌, జక్కన్న కలయికలో వస్తున్న తొలి సినిమా కావడం ఒక విశేషమైతే.. ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ తర్వాత రాజమౌళి రూపొందిస్తున్న చిత్రం కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. ఇప్పటికే విడుదలైన అప్‌డేట్స్‌ సినిమాపై అంచనాలను మరింత పెంచాయి. ఇప్పటివరకు వారణాసి నుంచి కొన్ని స్టిల్స్‌తో పాటు ఓ గ్లింప్స్‌ మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. దీంతో సినిమా కథ, ఇతర కీలక అంశాలకు సంబంధించిన పూర్తి స్థాయి అప్‌డేట్స్‌ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.

ఈ నేపథ్యంలో గత ఏడాది మాదిరిగానే వచ్చే నవంబర్‌లోనూ వారణాసి నుంచి మరో భారీ రివీల్‌ ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈసారి అయినా సినిమా కథకు సంబంధించిన కీలక విషయాలు, మరిన్ని పాత్రలు లేదా కొత్త విజువల్స్‌ను చిత్ర బృందం వెల్లడిస్తుందా? అన్న ఆసక్తి అభిమానుల్లో నెలకొంది. ఇప్పటివరకు వచ్చిన అప్‌డేట్స్‌తోనే భారీ హైప్‌ సొంతం చేసుకున్న వారణాసి.. తదుపరి రివీల్‌తో ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.

ఈ చిత్రంలో మహేశ్‌బాబు ‘రుద్ర’ పాత్రలో కనిపించనున్నారు. బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ ప్రియాంక చోప్రా ‘మందాకిని’గా నటిస్తుండగా.. మలయాళ నటుడు పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ ‘కుంభ’ అనే ప్రతినాయకుడి పాత్రలో కనిపించనున్నారు. కేఎల్‌ నారాయణ, ఎస్‌ఎస్‌ కార్తికేయ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అంతర్జాతీయ స్థాయిలో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్‌ మూవీ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విడుదలకు ఇంకా సమయం ఉండటంతో.. రాబోయే రోజుల్లో చిత్ర బృందం ఎలాంటి అప్‌డేట్స్‌ ఇస్తుందనేది ఆసక్తికరంగా మారింది. నవంబర్‌లో భారీ రివీల్‌ ఉంటుందనే ప్రచారంపై అధికారిక స్పష్టత వస్తే.. అభిమానుల ఎదురుచూపులకు తెరపడనుంది.