Site icon NTV Telugu

Varalaxmi: మరో తెలుగు సినిమాకి వరలక్ష్మీ గ్రీన్ సిగ్నల్?

Varalaxmi

Varalaxmi

నటుడు శరత్‌కుమార్‌ కూతురుగా సినీ రంగ ప్రవేశం చేసినా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకుంది వరలక్ష్మి. బోల్డ్ యాక్టింగ్, బోల్డ్ వాయిస్ తో ఆమె నటన ఇతర నటులతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ప్రస్తుతం తమిళ సినిమాలు మాత్రమే కాకుండా పెద్ద ఎత్తున తెలుగు సినిమాలు కూడా చేస్తూ ఆమె బిజీ బిజీగా ఉంది. అయితే నటనలో బిజీగా ఉన్న వరలక్ష్మి ప్రేమలో కూడా పడింది. నికోలాయ్‌ అనే గ్యాలరిస్టుతో ప్రేమలో పడిన వరలక్ష్మి అతన్నీ వివాహం కూడా చేసుకుంది. కేవలం తెలుగు, తమిళ సినిమాలు మాత్రమే కాదు, సౌతిండియా భాష‌ల్లో త‌న‌కంటూ స్పెష‌ల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతోంది.

Jani Master: ఆ రోజు నిజస్వరూపం బయటపడుతుంది.. కేసు పెట్టిన యువతికి జానీ మాస్టర్ కౌంటర్

ఈ క్ర‌మంలో ‘ఆదిపర్వం’ మూవీ డైరెక్టర్ సంజీవ్ మేగోటి ద‌ర్శ‌త్వంలో ఓ తెలుగు సినిమా చేయ‌బోతున్న‌ట్టు స‌మాచారం. సంజీవ్ మేగోటి రాసుకున్న సైకలాజికల్ యాక్షన్ థ్రిల్లర్ స‌బ్జెక్టు కోసం వ‌ర‌లక్ష్మి శరత్ కుమార్ ఓకే చెప్పినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ సినిమాలో వ‌ర‌లక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్ పాత్ర చేయ‌నుందని అంటున్నారు. ఇక భారీ బ‌డ్జెట్‌తో డైరెక్ట‌ర్ సంజీవ్ మేగోటి తెర‌కెక్కించ‌నున్న ఈ సినిమాలో ప‌లువురు ప్ర‌ముఖ న‌టీన‌టులను తీసుకోబోతున్నార‌ని అంటున్నారు. ఇక ఈ క్రమంలో వరలక్ష్మి శరత్ కుమార్ మెయిన్ లీడ్‌గా సంజీవ్ మేగోటి తెర‌కెక్కించ‌నున్న ఈ ప్రాజెక్టు ఇప్పుడు టాలీవుడ్ ఇండ‌స్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. పూర్తి వివ‌రాలు అతి త్వ‌ర‌లోనే ప్ర‌క‌టించ‌నున్న‌ట్టు చెబుతున్నారు.

Exit mobile version