NTV Telugu Site icon

Sabari : ఓటీటీలోకి వచ్చేస్తున్న వరలక్ష్మి శరత్ కుమార్ శబరి.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?

Sabari

Sabari

Sabari : నటి వరలక్ష్మి శరత్ కుమార్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ శబరి.అనిల్ కాట్జ్ తెరకెక్కించిన ఈ సినిమాను మహా మూవీస్ బ్యానర్ పై మహేంద్ర నాథ్  నిర్మించారు.సైకలాజికల్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో గణేష్ వెంకట్రామన్‌, శశాంక్ ముఖ్య పాత్రలు పోషించారు. మే 3న గ్రాండ్ గా రిలీజ్ అయిన శబరి మూవీ ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.అయితే ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్ యాక్టింగ్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ లభించింది.సినిమాలో వచ్చే ట్విస్ట్స్ కూడా అదిరిపోయినట్లు ప్రేక్షకులు తెలిపారు.

Read Also :Gam Gam Ganesha: దూసుకెళ్తున్న ‘గం గం గణేశ’.. బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ ఇలా..

అయితే కథలో కొత్తదనం లేకపోవటంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది.ఇదిలా ఉంటే ఈ సినిమా త్వరలోనే ఓటీటీలోకి రాబోతున్నట్లు సమాచారం.శబరి మూవీ ఓటిటి హక్కులను ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్నట్లు సమాచారం.శబరి సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియో జూన్ 14 న స్ట్రీమింగ్ చేయనున్నట్లు సమాచారం.ఈ సినిమా తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తుంది. త్వరలోనే శబరి ఓటీటీ రిలీజ్ డేట్‌పై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం.

Show comments