మల్టీటాలెంటెడ్, పవర్ఫుల్ పాత్రలకు పేరుగాంచిన వరలక్ష్మి శరత్‌కుమార్ తన కెరీర్‌లో ఒక సాహసోపేతమైన అడుగు వేయబోతోంది. నిరంతరంగా వివిధ క్రాఫ్ట్స్ లో తన టాలెంట్ ను చూపిస్తున్న వరలక్ష్జ్మీ నటిగా మంచి పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు నటిగానే కాకుండా నిర్మాతగా మరియు దర్శకురాలిగా మరో సెన్సేషన్ కు తెరలేపింది వరలక్ష్మి.
Also Read : Ravi Teja : ‘మాస్ జాతర’ రిలీజ్ డేట్ ఫిక్స్.. ఈ సారైనా వస్తారా మాస్టారు
తన సోదరి పూజా శరత్‌కుమార్‌తో కలిసి నిర్మాతగా సినిమాను నిర్మిస్తోంది. అందుకోసం దోస డైరీస్‌ను బ్యానర్ ను ప్రారంభిస్తున్నారు. . ఈ బ్యానర్‌లో తొలి సినిమాగా వరలక్ష్మి డైరెక్షన్ లో ‘సరస్వతి’ అనే ఆసక్తికరమైన థ్రిల్లర్ సినిమాను ఈరోజు అధికారికంగా ప్రకటించారు. సరస్వతి అనే టైటిల్ ‘ఐ’ అనే అక్షరం ఎరుపు రంగులో హైలైట్ చేస్తూ సినిమా యొక్క కథనాన్ని తెలియజేసారు. హై-కాన్సెప్ట్ థ్రిల్లర్‌గా రూపొందించబడిన సరస్వతిలో భారీ కాస్టింగ్ ఉంది. ఈ సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రధాన పాత్ర పోషిస్తుండగా, సీనియర్ నటుడు ప్రకాష్ రాజ్, సీనియర్ హీరోయిన్ ప్రియమణి మరియు యంగ్ హీరో నవీన్ చంద్ర ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ చిత్రానికి అగ్రశ్రేణి సాంకేతిక బృందం వర్క్ చేస్తోంది. ఈ సినిమాకు మ్యూజిక్ సంచలనం థమన్ ఎస్ సంగీతం అందిస్తుండగా, ఎ.ఎం. ఎడ్విన్ సకే కెమెరాను క్రాంక్ చేస్తారు. వెంకట్ రాజేన్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వర్తించగా, సుధీర్ మాచర్ల ఆర్ట్ డైరెక్టర్. ప్రవీణ్ డేనియల్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత. ఈ సినిమాకు సంబందించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడించనున్నారు. నటిగా, నిర్మాతగా, దర్శకురాలిగా తొలి ప్రయత్నం చేస్తున్న వరలక్ష్మి.. తొలి సినిమా ‘సరస్వతి’ సూపర్ హిట్ కావాలని ఆశిద్దాం.
