ప్రస్తుతం సెలబ్రిటీ ప్రపంచంలో విడాకులు, పెళ్లిళ్లు సాధారణమైపోయాయి. అందులోనూ సెలబ్రిటీల గురించి అయితే ప్రత్యేకంగా చెప్పాల్సిన పనే లేదు. ఏ రోజు ఏ సెలబ్రిటీ విడాకులు గురించి ప్రకటిస్తారో అనే విధంగా పరిస్థితి మారిపోయింది. ఈ నేపథ్యంలో తమిళ, తెలుగు సినీ పరిశ్రమలో గుర్తింపు పొందిన నటి వనిత విజయ్ కుమార్ మరోసారి వివాహంతో వార్తల్లో నిలిచింది. అది కూడా నాలుగో పెళ్లి..
Also Read : Adivi Sesh : ఆ కారణంగానే ‘డెకాయిట్’ నుండి శ్రుతి హాసన్ తప్పుకుంది..
వనిత విజయ్ కుమార్ గురించి పరిచయం అక్కర్లేదు.. కేవలం నటి మాత్రమే కాకుండా, వ్యాపారవేత్త, నిర్మాత, టీవీ వ్యాఖ్యాత, యూట్యూబర్‌గానూ పలు రంగాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకున్నారు. తమిళ చిత్రం ‘చంద్రలేఖ’ తో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె, ‘దేవి’ వంటి చిత్రాల ద్వారా తెలుగులోనూ మంచి గుర్తింపు పొందారు. అయితే వనిత సినీ కెరీర్ కన్నా ఆమె వ్యక్తిగత జీవితం మరింతగా హాట్ టాపిక్ అయ్యింది. ఇప్పటివరకు ఆమె మూడు వివాహాలు చేసుకొని, వాటన్నింటినీ విడాకులతో ముగించుకున్నారు. ముందుగా ఆకాశ్ అనే వ్యక్తిని మొదటి వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. అభిప్రాయ భేదాల వల్ల విడిపోయారు.
ఆ తర్వాత ఆనంద్ అనే వ్యాపారవేత్తను పెళ్లి చేసుకున్నారు. వీరికి ఒక కూతురు ఉంది. ఈ సంబంధం కూడా ఎక్కువ కాలం నిలబడలేదు. తర్వాత పీటర్ పాల్ అనే ఫొటోగ్రాఫర్‌తో మూడో పెళ్లి చేశారు. కానీ అది కూడా విఫలమైంది. ఇక ఇప్పుడు, ఆమె తన నాలుగో వివాహాన్ని కొరియోగ్రాఫర్ రాబర్ట్‌తో జరిపారు. ఈ వివాహ సమయంలో వనిత ఎమోషనల్ అవ్వడం, రాబర్ట్ ఆమె మెడలో తాళి కట్టిన సందర్భంగా కన్నీరు పెట్టుకోవడం ఆ వేడుకను హృద్యంగా మార్చాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చివరగా, అభిమానుల మదిలో ఓ ప్రశ్న మిగిలింది.. ‘ఈ నాలుగో వివాహం అయినా వనిత విజయ్ కుమార్‌కు స్థిరమైన జీవితం తీసుకురావచ్చా?’ అనే కామెంట్స్ పెడుతున్నారు.
