NTV Telugu Site icon

Vanitha: 43 ఏళ్ల వయసు.. ముగ్గురు పిల్లలు.. నాలుగో పెళ్లికి సిద్ధమైన హీరోయిన్??

vanitha

vanitha

Vanitha Vijayakumar 4th Marriage News: తెలుగు, తమిళ చిత్రసీమల్లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న వనితా విజయ్ కుమార్ 43 ఏళ్ల వయసులో నాలుగో పెళ్లికి సిద్ధమైంది. ఏంటి నిజమేనా? అనుకుంటున్నారా? అవును నిజమే. వనిత విజయ్ కుమార్ ప్రముఖ తమిళ నటుడు విజయ్ కుమార్, దివంగత తమిళ నటి మంజుల ముద్దుల కూతురు. ఇళయ దళపతి విజయ్ నటించిన ‘చంద్రలేఖ’ సినిమాతో హీరోయిన్ గా మారి సినిమా రంగంలోకి అడుగుపెట్టిన వనిత ఆ తర్వాత మూడు సినిమాలు చేసి బుల్లితెర వైపు మళ్లింది. ఆ తర్వాత మళ్లీ వెండితెరపైకి వచ్చేందుకు ప్రయత్నించింది కానీ.. ఈలోగా కోలీవుడ్ లో ఆమెకు సగం తలుపులు మూసుకుపోయాయి. ఈ క్రమంలో వనితా విజయ్ కుమార్ సహాయ పాత్రలకే పరిమితమైంది. వనిత విజయ్ కుమార్ 2000లో టీవీ నటుడు ఆకాష్‌ను వివాహం చేసుకుంది. ఈ వివాహబంధంతో హరి, జోవిక అనే ఇద్దరు పిల్లలకు తల్లి కూడా అయింది.

Tollywood: ఒక్క క్లిక్.. అదిరిపోయే మూడు అప్‌డేట్స్.. క్లిక్ చేస్తే వావ్ అనాల్సిందే..

అయితే ఆ తర్వాత ఈ జంట విడిపోయింది. ఆమె ఆకాష్ నుండి విడిపోయిన తర్వాత 2007లో వ్యాపారవేత్త ఆనంద్ జై రాజన్‌ను వివాహం చేసుకుంది. వీరికి ఒక కుమార్తె కూడా ఉంది. ఈ పెళ్లి కూడా ఎక్కువ కాలం నిలవలేదు. 2012లో భార్యాభర్తలు విడిపోయారు. ఆనంద్ నుంచి దూరమైన తర్వాత వనిత విజయ్‌ కుమార్‌ వీఎఫ్‌ఎక్స్‌ టెక్నీషియన్‌ పీటర్‌ పాల్‌తో క్రైస్తవ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ తర్వాత కేవలం 04 నెలల్లోనే విడిపోయారు, ఆ తరువాత కొద్ది రోజులకే పీటర్ పాల్ కన్నుమూశారు. అయితే వనితా విజయ్ కుమార్ నాలుగో పెళ్లికి సూచనలు ఇచ్చిందనే వార్తలు తమిళనాడు వ్యాప్తంగా వినిపిస్తున్నాయి. ఈ మేరకు తమిళ మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. వనిత పెళ్లి చేసుకోబోయే వ్యక్తి ఎవరనే ప్రశ్నకు కూడా కొందరు సమాధానం వెతకడం మొదలుపెట్టారు. త్వరలోనే వనిత తన నాలుగో పెళ్లిని అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు. వనిత విజయ్ కుమార్ సోదరుడు అరుణ్ విజయ్ తమిళంలో హీరో. సోదరీమణులు ప్రీత, శ్రీదేవి కూడా నటీమణులే.

Show comments