Site icon NTV Telugu

“వకీల్ సాబ్”కు అదిరిపోయే టీఆర్పీ

Vakeel Saab Prime Streaming on April 30

మూడేళ్ల విరామం తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీ ఇచ్చిన కోర్టు డ్రామా “వకీల్ సాబ్‌”. ఇది జాతీయ అవార్డు గెలుచుకున్న హిందీ చిత్రం “పింక్” రీమేక్. “వకీల్ సాబ్‌”కు వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించారు. ప్రముఖ నిర్మాత దిల్ రాజు, బోనీ కపూర్ సంయుక్తంగా నిర్మించారు. పవన్ కళ్యాణ్ తో పాటు ‘వకీల్ సాబ్’ చిత్రంలో నివేదా థామస్, అంజలి, అనన్య నాగల్లా, ప్రకాష్ రాజ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక వకీల్ సాబ్ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌ను జూలై 18న సాయంత్రం 6 గంటలకు జీ తెలుగులో ప్రసారం చేసింది. పవన్ కళ్యాణ్, శృతి హాసన్ నటించిన కోర్ట్ రూమ్ డ్రామా “వకీల్ సాబ్” ప్రపంచ టెలివిజన్ ప్రీమియర్‌తో 19.12 టిఆర్‌పి రేటింగ్‌ను సాధించింది.

Read Also : సోడాల శ్రీదేవి వచ్చేసింది.. సూరిబాబు హ్యాపీ !

అయితే సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ నటించిన ఈ చిత్రం అల్లు అర్జున్ నటించిన యాక్షన్, రొమాంటిక్ మూవీ “అల వైకుంఠపురము”లో, మహేష్ బాబు నటించిన “సరిలేరు నీకెవ్వరు”ను ఓడించలేకపోయింది. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన అల్లు అర్జున్ “అల వైకుంఠపురము”లో 29.4 టిఆర్పి రేటింగ్‌తో అగ్రస్థానంలో ఉంది. మహేష్ బాబు “సరిలేరు నీకెవ్వరు”, ప్రభాస్, రాజమౌళి చిత్రం “బాహుబలి 2: ది కంక్లూజన్”, శ్రీమంతుడు వరుసగా 23.04, 22.7, 22.54 రేటింగ్‌లతో రెండవ, మూడవ, నాల్గవ స్థానాల్లో ఉన్నారు.

Exit mobile version