NTV Telugu Site icon

వ‌కీల్ సాబ్ లోని స‌త్య‌మేవ జ‌య‌తే పూర్తి పాట విడుద‌ల‌!

ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ తాజాచిత్రం వ‌కీల్ సాబ్ థియేట‌ర్ల‌లోనే కాదు… ఆ త‌ర్వాత ఓటీటీలోనూ సంద‌డి చేసింది. ప‌వ‌న్ ఫ్యాన్స్ ఈ మూవీ చూసి ఫిదా అయిపోతే, స‌గటు సినిమా ప్రేక్ష‌కుడు ఇందులో క‌థాంశానికి పూర్తి స్థాయిలో మార్కులు వేశాడు. సోష‌ల్ మీడియాలో కొంద‌రు ఈ చిత్రాన్ని ఇటు అమితాబ్ పింక్తో పోల్చితే, మ‌రికొంద‌రు అజిత్ త‌మిళ సినిమాతో పోల్చారు. అయినా… అంద‌రి అంచ‌నాల‌ను త‌ల్ల‌కిందులు చేస్తూ ఈ సినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబ‌ట్టింది. తాజాగా ఈ సినిమాలో హైలైట్ గా నిలిచిన స‌త్య‌మేవ జ‌య‌తే గీతం ఫుల్ వీడియో సాంగ్ ను ఆదిత్య మ్యూజిక్ సంస్థ విడుద‌ల చేసింది. త‌మ‌న్ స్వ‌రాలకు రామ‌జోగ‌య్య శాస్త్రి సాహిత్యాన్ని అందించగా, శంక‌ర్ మ‌హ‌దేవ‌న్, పృద్వీచంద్ర‌, త‌మ‌న్ ఈ గీతాన్ని ఆల‌పించారు. ఇదే సినిమాలోని మ‌గువ మ‌గువ‌ గీతం ఫుల్ వీడియోను ఈ నెల 13న రిలీజ్ చేశారు. దానికీ సూప‌ర్ రెస్పాన్స్ వ‌చ్చింది.