Site icon NTV Telugu

‘మెరిసే మెరిసే’ యూనిట్‌ను వి. వి. వినాయ‌క్‌ విషెస్

‘హుషారు’ ఫేమ్ దినేష్ తేజ్, శ్వేతా అవస్తి జంటగా నటించిన సినిమా ‘మెరిసే మెరిసే’. పవన్ కుమార్ కె. దర్శకత్వంలో వెంకటేష్ కొత్తూరి ఈ చిత్రాన్ని నిర్మించారు. లవ్, కామెడీ, ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ‘మెరిసే మెరిసే’ చిత్రం పీవీఆర్ పిక్చర్స్ ద్వారా ఆగస్టు 6న థియేటర్లలో విడుదల కాబోతోంది. రీసెంట్‌గా విడుద‌లైన ఈ సినిమా ట్రైల‌ర్‌ను చూసి, చిత్ర బృందాన్ని టాలీవుడ్ స్టార్ డైరెక్ట‌ర్ వి. వి. వినాయ‌క్ అభినందించారు. ఈ సంద‌ర్భంగా వినాయ‌క్ మాట్లాడుతూ ”డైరెక్ట‌ర్ ప‌వ‌న్ రాజ‌మండ్రి కుర్రాడు. మా నాన్న‌గారి స్నేహితుడు సుబ్బ‌రాజు గారి అబ్బాయి. అతను ‘మెరిసే మెరిసే’ మూవీతో దర్శకుడిగా పరిచయం కావడం ఆనందంగా ఉంది. ‘హుషారు’ చిత్రంలో న‌టించిన దినేశ్ ఇందులో హీరోగా న‌టించాడు. ఈ సినిమాకు ప‌నిచేసిన యూనిట్‌లో చాలా మంది రీసెంట్ సినిమాల్లో ప‌నిచేసిన‌వారే. ఓ మంచి టీమ్ చేసిన ఈ ప్ర‌య‌త్నం డెఫ‌నెట్‌గా పెద్ద హిట్ కావాల‌ని మ‌న‌స్ఫూర్తిగా కోరుకుంటున్నాను” అని అన్నారు.

ద‌ర్శ‌కుడు ప‌వ‌న్ కుమార్ మాట్లాడుతూ ”యుక్త‌వ‌య‌సులో అమ్మాయి, అబ్బాయిల మ‌న‌సులు సునిశితంగా ఉంటాయి. అలాంటి వారు క‌లిసి చేసే ప్ర‌యాణంలో ఎలాంటి ఒడిదొడుకుల‌ను ఎదుర్కొన్నారు, ఎలా స‌క్సెస్ అయ్యార‌నే క‌థాంశంతో ఈ సినిమా రూపొందింది. అందరికీ మా సినిమా న‌చ్చుతుందనే నమ్మకం ఉంది” అని అన్నారు. హీరో దినేశ్ తేజ్ మాట్లాడుతూ ”కోవిడ్ స‌మ‌యంలో చాలా స్ట్ర‌గుల్స్ ఫేస్ చేసి సినిమాను విడుద‌ల చేస్తున్నాం. ఇండ‌స్ట్రీ నుంచి చ‌క్క‌టి మ‌ద్ద‌తు ల‌భించింది. వినాయ‌క్ వంటి పెద్ద డైరెక్ట‌ర్ మా యూనిట్‌ను అభినందించ‌డ‌మే అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్‌. ‘మెరిసే మెరిసే’ చ‌క్క‌టి మూవీ. ప్లెజంట్ గా ఉంటుంది. థియేటర్ లలో చూసి ఆశీర్వ‌దిస్తార‌ని భావిస్తున్నాం” అని చెప్పారు.

Exit mobile version