Site icon NTV Telugu

Ustaad Bhagat Singh Release Date: అబ్బాయ్ ప్లేస్‌లో బాబాయ్.. ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ ఇదే?

Ustaad Bhagat Singh Release Date

Ustaad Bhagat Singh Release Date

ఫైనల్‌గా ‘పవర్ స్టార్’ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ రిలీజ్ డేట్ అనౌన్స్ చేయడానికి సిద్ధమయ్యారు మేకర్స్. లేటెస్ట్ అప్‌డేట్స్ ప్రకారం.. ఒకటి లేదా రెండు రోజుల్లోనే ఈ సినిమా అఫీషియల్ రిలీజ్ డేట్ రాబోతోందని తెలుస్తోంది. మొన్నటి వరకు ఈ సినిమా ఏప్రిల్‌లో వస్తుందని ప్రచారం జరిగింది. కానీ తాజా సమాచారం ప్రకారం.. మేకర్స్ మార్చి 26 లేదా 27వ తేదీని లాక్ చేసినట్లు తెలుస్తోంది. నిజానికి ఈ డేట్‌కు రావాల్సిన రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమా వాయిదా పడటంతో.. ఇప్పుడు ఆ ప్లేస్‌లోకి ‘ఉస్తాద్’ రాబోతోంది. అంటే ‘అబ్బాయ్ ప్లేస్‌లో బాబాయ్’ వస్తున్నాడన్నమాట.

Also Read: iPhone 17 Buy: ఐఫోన్ లవర్స్‌కు శుభవార్త.. యూస్ నుంచి ఈజీగా ‘ఐఫోన్ 17’ తెచ్చేసుకోవచ్చు!

గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ చేస్తూ చాలా కాలానికి దర్శకుడు హరీశ్ శంకర్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో వస్తున్న సినిమా కావడంతో ఉస్తాద్ భగత్ సింగ్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘ఓజీ’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఫ్యాన్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ఫస్ట్ సాంగ్‌ ఫ్యాన్స్‌కు సూపర్ కిక్ ఇచ్చాయి. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. డబ్బింగ్ వర్క్ కూడా మొదలైపోయింది. హరీష్ శంకర్ మేకింగ్, పవర్ స్టార్ స్క్రీన్ ప్రజెన్స్‌, దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్‌కు బాక్సాఫీస్ బద్దలవ్వడం ఖాయం అనే నమ్మకంతో అభిమానులు ఉన్నారు. ఈ సినిమాలో పవన్ సరసన శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరి ఉస్తాద్ ఎలా ఉంటుందో చూడాలి.

Exit mobile version