Urvasivo Rakshasivo: అల్లు శిరీష్ నటించిన ‘ఊర్వశివో రాక్షసివో’ సినిమా ఇటీవల విడుదలై పాజిటీవ్ టాక్ ను తెచ్చుకుంది. తమిళ సినిమా ‘ప్యార్ ప్రేమ కాదల్’ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో శిరీష్ సరసన అను ఇమ్మాన్యుయేల్ కథానాయిక. వెన్నెల కిశోర్, సునీల్ నటించిన ఈ సినిమాకు రాకేశ్ శశి దర్శకత్వం వహించారు. శ్రీ తిరుమల ప్రొడక్షన్స్ తో కలసి గీతా ఆర్ట్స్ 2 ఈ సినిమాను నిర్మించింది. ఇప్పటి వరకూ భారీ సక్సెస్ లేని అల్లు శిరీష్ కి ఈ సినిమా టాక్ ఆక్సిజన్ ని ఇచ్చిందనే చెప్పాలి. దాంతో భారీ స్థాయిలో సక్సెస్ మీట్ నిర్వహించారు. అందులో అల్లు అర్జున్ సినిమాను ఆకాశానికి ఎత్తడంతో బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్ళు వస్తాయని ఆశించారు. అయితే ఆశ్చర్యకరంగా మొదటి వారాంతంలో శిరీష్ గత చిత్రాల వసూళ్ళకు కూడా దగ్గరగా రాలేక పోయింది.
Read also: Governor Tamilisai: గ్రేస్ మార్కులు పెంచడం సాధ్యమే కానీ.. సబ్జెక్టు మినహాయింపుపై నో ఛాన్స్
ప్రపంచవ్యాప్తంగా వీకెండ్ లో 3.75 కోట్ల గ్రాస్ మాత్రమే వసూలు చేసింది. ఆశించన దానికంటే ఎక్కువ హైప్ ను, టాక్ ను తెచ్చుకుని విమర్శకుల ప్రశంసలు అందుకున్నా ఎందుకో ఏమో ఆడియన్స్ మాత్రం ఇంకా ఈ సినిమా కోసం కదలలేదు. ఇక అల్లు శిరీష్ గత సినిమాల కలెక్షన్ల విషయానికి వస్తే, ‘శ్రీరస్తు శుభమస్తు’ మొదటి వారంలో 9.9 కోట్లు, ‘ఒక్క క్షణం’ 7 కోట్లు వసూలు చేయగా… అట్టర్ ప్లాప్ అయిన ‘ఎబిసిడి’ 6 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ప్రస్తుత ఉన్న ట్రెండ్ ప్రకారం ‘ఊర్వశివో రాక్షసివో’ వాటి సమీపానికి వెళ్ళే ఆస్కారం ఎంత మాత్రం లేదు. కోవిడ్ తర్వాత ఆడియన్స్ థియేటర్లకు రావటానికి అంతగా ఆసక్తి చూపకపోడం, 4 సంవత్సరాలుగా శిరీష్ సినిమాలు చేయకపోవడం వంటివి ప్రతికూల ప్రభావం చూపాయని చెప్పవచ్చు. నిజానికి గత వారం విడుదలైన అన్ని సినిమాల్లోకి శిరీష్ ‘ఊర్వశివో రాక్షసివో’కి మాత్రమే మంచి టాక్ వచ్చింది. దీనికే వసూళ్ళు లేక పోతే ‘లైక్ షేర్ సబ్ స్క్రైబ్’, ‘బొమ్మ బ్లాక్ బస్టర్’ వంటి మిగతా సినిమాల పరిస్థితి ఇంకా ఎంత ఘోరంగా ఉందో ఊహించుకోవచ్చు.
Young Rebel Star Prabhas: ‘బ్రహ్మాస్త్ర’లో ప్రభాస్!?
