Site icon NTV Telugu

Uppu Kappurambu: “ఉప్పు కప్పురంబు” మ్యూజిక్ ఆల్బమ్ విడుదల

Uppukappu

Uppukappu

భారతదేశంలో ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అయిన ప్రైమ్ వీడియో, తాజా తెలుగు ఒరిజినల్ సినిమా “ఉప్పు కప్పురంబు” ఈ సినిమాలో మ్యూజిక్ ఆల్బమ్‌ను ఈరోజు విడుదల చేసింది. బిలీవ్ ఇండియా లేబుల్ ద్వారా విడుదలైన ఈ ఆల్బమ్‌లో మూడు ప్రత్యేకమైన పాటలు ఉన్నాయి. ఈ పాటలు చిత్రంలో చూపించే చిన్న పట్టణ జీవితం, హాస్యం, భావోద్వేగాలు అన్నింటినీ మనస్సుకు హత్తుకునేలా ఉన్నాయి.

Also Read : Dil Raju: దిల్ రాజు భార్యతో ఎన్టీవీ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ..

ఈ సినిమాకు సంగీతాన్ని స్వీకార్ అగస్తి అందించగా, పాటల రాతలు రవికృష్ణ విస్సాప్రగడ, ఎస్. అత్తావుర్ రహీం మరియు రఘురాం ద్రోణావజ్జల చేశారు. ఈ పాటలు పాడిన సీన్ రోల్డన్, అనురాగ్ కులకర్ణి ఆంటోని దాసన్, వీళ్ళ గానంతో పాటలు ఇంకా హృద్యంగా మారాయి.

Also Read : Maargan Review: మార్గన్ రివ్యూ

ఒకవైపు నోమిలాలా అనే పాట ఉత్సవాన్ని పాడుతుంటే, మరోవైపు యాడున్నావో అనే పాట ఒక తల్లి & బిడ్డ మధ్య దూరాన్ని హృదయాన్ని తాకేలా చూపుతుంది. అలాగే టైటిల్ సాంగ్ ఉప్పు కప్పురంబు పాటలో గ్రామీణ శైలి, ఉల్లాసం, ధైర్యం అన్నీ కలిసి ఉంటాయి.ఈ పాటలు ఇప్పుడు అమెజాన్ మ్యూజిక్, స్పాటిఫై, జియోసావన్, ఆపిల్ మ్యూజిక్ లాంటి ప్రముఖ మ్యూజిక్ యాప్స్‌లో వినేందుకు అందుబాటులో ఉన్నాయి.

Exit mobile version