మెగా ఫ్యామిలీ నుంచి టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన మరో హీరో వైష్ణవ్ తేజ్. మొదటి సినిమా “ఉప్పెన”తోనే బ్లాక్ బస్టర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుని, భారీ కలెక్షన్స్ రాబట్టి రికార్డులు క్రియేట్ చేశాడు. ఈ చిత్రం విడుదలై రెండు నెలలు కావస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రముఖ ఓటీటీ వేదిక నెట్ ఫ్లిక్స్ లో ఈరోజు నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ మేనల్లుడిని ‘ఉప్పెన’తో టాలీవుడ్ కు పరిచయం చేసింది బుచ్చిబాబు సాన. సుకుమార్ శిష్యుడైన బుచ్చిబాబుకు కూడా దర్శకుడిగా ఇదే మొదటి చిత్రం. ఇక హీరోయిన్ కృతి శెట్టికి కూడా ఇదే తొలిచిత్రం అయినప్పటికీ సినిమాలో బేబమ్మగా ప్రేక్షకులను మైమరపించింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం సినిమాను మరో మెట్టు పైకెక్కించింది.
నెట్ ఫ్లిక్స్ లో “ఉప్పెన”
