సోషల్ మీడియాలో వచ్చే వార్తలో పది శాతం నిజాలు ఉంటే.. మిగతా తొంబై శాతం అబ్బదాలు పుకార్లే ఉంటాయి. ముఖ్యంగా సెలబ్రిటీల హెల్త్ విషయంలో చిన్న దాని పెద్ద చేసి రచ్చ రచ్చ చేస్తుంటారు. ఇందులో భాగంగా తాజాగా ప్రముఖ కన్నడ నటుడు ఉపేంద్ర ఆరోగ్యం క్షీణించడంతో బెంగళూరులోని స్పర్శ్ ఆసుపత్రిలో చేర్పించారని, అక్కడ చికిత్స అందించారని కొందరు చెప్పగా, మరికొందరు ఉపేంద్ర ఇంకా కోలుకోకపోవడంతో, కుటుంబ సభ్యులు ఆసుపత్రికి పరుగులు తీస్తున్నారని వార్తలు వచ్చాయి. ‘యూఐ’ సినిమా చిత్రీకరణ సమయంలో ఆయనకు అనారోగ్య సమస్యలు తలెత్తాయని, అవి ఇప్పుడు తీవ్రమయ్యాయని.. అనేక కథనాలు నెట్టింట హల్‌చల్ చేశాయి. ఈ క్రమంలో అభిమానులు ఆందోళన చెందారు. అయితే తాజాగా ఈ విషయంపై తన ఆరోగ్య పై స్పందించాడు ఉపేంద్ర.
Also Read: NTR: ఎన్టీఆర్ ఇంట్లో ఆ దర్శకుడి కోసం ప్రత్యేక కుర్చీ !
‘అందరికీ నమస్కారం.. నేను ఆరోగ్యంగా ఉన్నాను. నార్మాల్‌గా రెగ్యులర్ చెకప్ కోసం మాత్రమే నేను ఆసుపత్రికి వెళ్ళాను అంతే తప్ప.. సోషల్ మీడియాలో వస్తున్న వదంతులు విని అభిమానులు ఏ మాత్రం ఆందోళన చెందవద్దు. మీ ప్రేమ, అభిమానానికి నా ధన్యవాదాలు. నేను క్షేమంగా ఉన్నాను. మీకు కంగారు పడకండి’ అంటూ ఉపేంద్ర తన ట్వీట్‌లో పేర్కొన్నారు. దీంతో ఈ గాలి వార్తలకి పులిస్టాప్ పడింది. ఇక తమ అభిమాన నటుడు ఆరోగ్యంగానే ఉన్నారని తెలిసి అభిమానులు కాస్త సంతోషంగానే ఉన్నా, ఆయన సడెన్‌గా ఆసుపత్రికి ఎందుకు వెళ్లారనే దానిపై పలు ఆలోచనలు చేస్తున్నారు. ఎందుకంటే కొంతమంది నటినటులు అభిమానులు కంగారు పడతారు అని కొన్ని విషయాలు దాచేస్తూ ఉంటారు.
