NTV Telugu Site icon

Upendra : వెరైటీ టైటిల్స్ పెట్టడానికి కారణం అదే

Upendra (2)

Upendra (2)

రియల్ స్టార్ ఉపేంద్రకు కన్నడ నాటనే కాదు.. టాలీవుడ్‌లో కూడా కల్ట్ ఫ్యాన్ బేస్ ఉంది. అందులో నో డౌట్. ఇలాంటి టైటిల్స్, సినిమాలు ఆయన మాత్రమే తీయగలడేమో అనేలా ఉంటాయి. అయితే వర్సటైల్ టైటిల్స్ పెట్టడానికి రీజన్ ఏంటో రీసెంట్లీ షేర్ చేసుకున్నాడు ఉప్పీ. ష్, రా, ఏ.. ఏంటీ కోప్పడుతున్నారనుకుంటున్నారా.. కాదండీ బాబు.. ఇవి ఉపేంద్ర సినిమా టైటిల్స్. విచిత్రమైన హావ భావాలు పకలన్నా,  వెరైటీ టైటిల్స్ పెట్టాలన్నా, విభిన్న కథలను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలన్నా ఉపేంద్ర తర్వాతే ఎవరైనా. సినిమా టైటిల్సేనే కాదు యాక్టింగ్‌తో కూడా పిచ్చెక్కిస్తుంటాడు. 90స్‌లో ఆయన నటనను తిడుతూనే పొడిగిన వారున్నారు. అంత మ్యాడ్ నెస్ క్రియేట్ చేశాడు ఉప్పీ.

Also Read : GameChanger : ‘దోప్’ లిరికల్ సాంగ్ రిలీజ్.. చరణ్ డాన్స్ వేరే లేవల్

అంతేనా డిస్టోపియన్ సినిమాలు తీయడంలో దిట్ట. భవిష్యత్తులో ప్రపంచం ఇలా ఉంటుందన్న ఊహాగానాలను తెరపైకి తెస్తుంటాడు. రీసెంట్లీ రిలీజైన యుఐ కూడా ఈ కేటగిరికి చెందినదే. తొమ్మిదేళ్ల గ్యాప్ తర్వాత కెమెరా పట్టిన ఉపేంద్ర ప్రజెంట్ రాడ్ రియాలిటీని చూపిస్తూ సొసైటీపై సెటైర్స్ వేసి మరోసారి తన మార్క్ చూపించాడు. సినిమా మొదలయ్యే ముందు తెలివైన వాళ్లు థియేటర్ల నుండి వెళ్లిపోండి. మూర్ఖులు సినిమా చూడండి అంటూ సినిమాకు లాజిక్స్ వెతికే వాళ్లకు కౌంటర్ వేసేశాడు. ఇలాంటి సెటైర్స్ వేయడం మేబీ ఉపేంద్రకే చెల్లుతుందేమో. వెరైటీ టైటిల్స్ పెట్టడానికి రీసెంట్లీ రానాతో జరిగిన ఇంటర్వ్యూలో రివీల్ చేశాడు ఉప్పీ. అప్పట్లో చిన్న బడ్జెట్. వెల్ ఎస్టాబ్లీష్ హీరో కాదు. నేను సినిమా తీస్తున్నాను రా అంటే ఎవరూ చూస్తారు. వెరైటీ పోస్టర్ పెడితే.. ఏంట్రా ఇలాంటి టైటిల్ పెట్టాడు అని తిట్టడానికైనా థియేటర్లకు వస్తారని ఇలా పేర్లు పెట్టినట్లు చెప్పాడు. అలా సక్సెస్ కావడంతో కంటిన్యూ చేసినట్లు చెప్పుకొచ్చాడు.