Kollywood : రాబోయే మూడు నెలలు కోలీవుడ్ బాక్సాఫీస్ మళ్లీ కళకళలాడబోతుంది

Kollywood

Kollywood

టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ నుండి వచ్చిన సినిమాలు తమిళ  బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయాయి. దాంతో ఇప్పుడు కోలీవుడ్ నుంచి రాబోతున్న భారీ ప్రాజెక్టులు బాక్సాఫీస్ వద్ద మళ్లీ పాత వైభవాన్ని తెస్తాయని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి. రాబోయే మూడు నెలల్లో (అక్టోబర్, నవంబర్, డిసెంబర్) వరుసగా ప్రేక్షకుల ముందుకు రానున్న మూడు భారీ తమిళ చిత్రాలపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.

అక్టోబర్ : సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ దిలీప్‌కుమార్ కాంబినేషన్‌లో వచ్చిన ‘జైలర్’ మూవీ ఎంతటి సంచలన విజయం సాధించిందో అందరికీ తెలిసిందే. దానికి సీక్వెల్‌గా వస్తున్న ‘జైలర్ 2’ అక్టోబర్ నెలలో విడుదల కానుంది. రజినీకాంత్ మార్క్ యాక్షన్, అనిరుధ్ సంగీతం మళ్లీ థియేటర్లలో విజిళ్లు వేయించేలా ఉంటాయని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

నవంబర్ : సూర్య కథానాయకుడిగా ‘రోమాంచం’ ఫేమ్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న మాస్ యాక్షన్ డ్రామా ‘సీన్’ నవంబర్ రేసులో నిలిచింది. సూర్య వైవిధ్యమైన నటనకు, జిత్తు మాధవన్ మేకింగ్ శైలి తోడవ్వడంతో ఈ చిత్రంపై పరిశ్రమలో భారీ అంచనాలు నెలకొన్నాయి.

డిసెంబర్ : ధనుష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘ఓమ్‘ డిసెంబర్ నెలలో ప్రేక్షకు ముందుకు రాబోతోంది. ధనుష్ కెరీర్‌లోనే ప్రత్యేకమైన కథాంశంతో వస్తున్న ఈ చిత్రం సంవత్సరాంతంలో విడుదలవుతూ తమిళ సినిమాల మార్కెట్‌కు ఒక గ్రాండ్ ముగింపుని ఇస్తుందని భావిస్తున్నారు.