NTV Telugu Site icon

Upasana: పిల్లల్ని కనే విషయంలో ఆధునికతను అనుసరించండి : ఉపాసన

February 7 (39)

February 7 (39)

ఈ మధ్యకాలంలో పిల్లలను కనడం అనేది పెద్ద సమస్యగా ఫీల్ అవుతున్నారు. అప్పట్లో పది మంది పిల్లలను ఎంతో ఈజీగా కనేవారు కానీ ఇప్పుడు మాత్రం ఒకరిని కనడం కోసం నానా తిప్పలు పడుతున్నారు. ముఖ్యంగా లెట్ మ్యారేజ్ వల్లు ఈ విషయంలో చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. అయితే ఇలాంటి వారి కోసం ఎగ్ ఫ్రీజింగ్‌ స్టార్స్ క్యాంపెయిన్ మొదలు పెట్టారు. పిల్లల కోసం అండాన్ని దాచుకోవ‌డం.. దీనినే ఎగ్ ఫ్రీజింగ్ అని పిలుస్తున్నారు. అంటే యుక్త వ‌య‌సులో అండాన్ని ఫ్రీజ్ చేయడం అని అర్ధం. ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇది అత్యవ‌స‌రం అని వైద్యులు చెబుతున్నారు. ఆ విషయం పైనే తాజాగా ఉపాసన కొణిదెల ఇటీవల ఓ ఇంట‌ర్వ్యూలో ప్రస్థావించింది.

Also Read : Rashmika: రష్మిక ఏంటి ఇలా అనేసింది?

‘పిల్లలను కనే విషయంలో మహిళలు ముందు చూపుతో ఉండాలి. ఇప్పుడే పిల్లల్ని క‌నాల‌నుకోని దంప‌తుల‌కు ఎగ్ ఫ్రీజింగ్ ఒక ఆప్షన్. ఆధునిక‌త‌ను అనుస‌రించ‌డం త‌ప్పేమీ కాదు. ఫ్యూచర్ లో పిల్లల‌ను క‌నాలంటే యుక్తవ‌య‌సు ద‌శ‌లోనే ఎగ్ ఫ్రీజింగ్ చేయాల‌నే ప్రయ‌త్నం మంచిది’ అని ఉపాస‌న వెల్లడించింది.ఇంత‌కుముందు ఇదు మృణాల్ ఠాకూర్, మెహ్రీన్ కౌర్ పిర్జాదా వంటి సెల‌బ్రిటీలు కూడా ఈ ఎగ్ ఫ్రీజింగ్ విషయంలో మ‌ద్ధతుగా మాట్లాడారు.

మాజీ మిస్ ఇండియా ఈషా గుప్తా కూడా తాను ఇలాంటి జాగ్రత్తలే తీసుకున్నాన‌ని తెలిపారు. గుడ్లను దాచి ఉంచ‌డం (ఫ్రీజింగ్) వ‌ల్ల వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలు పుట్టవచ్చని ప్రజలకు వివ‌రించి చెప్పారు. చాలా మందికి దీని గురించి ఎక్కువగా తెలియదు. చెప్పిన కూడా ముందు భయపడతారు. కానీ భవిష్యత్తులో మనం ఎంత హెల్తీగా ఉన్నాం అనేది మనం కనే పిల్లల మీద ఆధారపడి ఉంటుంది. ఒక బిడ్డకు జన్మనివ్వాలి ప్రతి ఒక స్త్రీ కోరుకుంటుంది. కానీ ఫ్యూచర్ కోపం పరిగెడుతూ పెళ్లి.. పిల్లలు అనే విషయంలో చాలా ఆలస్యం చేస్తున్నారు. అలాంటి వారు ఈ ఎగ్ ఫ్రీజింగ్ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవడం మంచిది.