Site icon NTV Telugu

Unstoppable Season 3: ఈ సారి అంతకు మించి.. 23 నుంచి షూట్ .. గెస్ట్ లిస్ట్ చూశారా?

Unstoppable With Nbk

Unstoppable With Nbk

Unstoppable Season 3 Shoot with Nagarjuna Will Start: నందమూరి బాలకృష్ణ ఇమేజ్ మొత్తాన్ని మార్చేసిన అన్‌స్టాపబుల్ షో ఇప్పుడు మళ్ళీ మీ ముందుకు రంగాఉంది. అన్‌స్టాపబుల్ అనే షో ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అయింది. మొదటి సీజన్ హిట్ కావడంతో రెండో సీజన్ చేయగా ఆ రెండో సీజన్ కూడా సూపర్ హిట్ అయింది. ఇక ఆ జోష్ తో ఈ షో ఇప్పుడు మూడవ సీజన్ కు రెడీ అయిపోతుంది. ఈ సీజన్ షూటింగ్ ను ఆగస్ట్ 23 నుంచి స్టార్ట్ చేయనున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ మూడవ సీజన్ కు మొదటి గెస్ట్ గా అక్కినేని నాగార్జున రాబోతున్నారని, మరి వీరిద్దరి కాంబో లో వచ్చే అన్‌స్టాపబుల్ సీజన్ 3 మొదటి ఎపిసోడ్ ఒక రేంజ్ లో ప్లాన్ చేశారని అంటున్నారు.

VidaaMuyarchi: అజిత్‌ ‘విదాముయార్చి’ రిలీజ్‌ డేట్‌ లాక్!

అన్‌స్టాపబుల్ మొదటి సీజన్ నాని, బ్రహ్మానందం, అనిల్ రావిపూడి, బోయపాటి, థమన్, శ్రీకాంత్, ప్రగ్యా, రాజమౌళి, కీరవాణి, బన్నీ, రష్మిక, సుకుమార్, రవితేజ, విజయ్ దేవరకొండ, రానా, పూరి, చార్మి, మహేష్ బాబు లాంటి స్టార్స్ తో 10 ఎపిసోడ్స్ చేశారు. సెకండ్ సీజన్ లో మూవీ స్టార్స్ తో పాటు.. పొలిటీషియన్స్ ను కూడా భాగమయ్యేలా చేసి చంద్రబాబు, లోకేష్ వంటి వాళ్లతో అలరించారు. ఈ మూడవ సీజన్ లో కూడా రజనీ కాంత్, రేవంత్ రెడ్డి, బాలయ్య అల్లుళ్ళతో కుమార్తెలు అంటూ గట్టిగానే ప్లాన్ చేసినట్టు తెలుస్తోంది. ఈ సారి కూడా షో తో మళ్ళీ రికార్డులు బద్దలు కొట్టడమే పనిగా పెట్టుకున్నారని తెలుస్తోంది.

Exit mobile version