NTV Telugu Site icon

Unstoppable 4 : కేవలం అల్లు అరవింద్‌ కోసమే ఒప్పుకొన్నా : బాలకృష్ణ

Nbk

Nbk

హైదరాబాద్: ఆహా OTT ప్లాట్‌ఫారమ్, ఎన్‌బికె మోస్ట్ ఎవైటెడ్ అన్‌స్టాపబుల్ సీజన్‌ 4 ను శనివారం అనౌన్స్ చేసింది. మునుపెన్నడూ చూడని సూపర్ హీరో పాత్రలో లెజెండరీ, షో హోస్ట్ నందమూరి బాలకృష్ణను ప్రజెంట్ చేసే అద్భుతమైన ఫస్ట్ లుక్, 3D యానిమేటెడ్ ప్రోమోని లాంచ్ చేసింది.రతన్ టాటాకు నివాళులర్పిస్తూ ఒక క్షణం మౌనం పాటించడంతో కార్యక్రమం ప్రారంభమైంది. అల్లు అరవింద్ (ఆహా డైరెక్టర్), అనిల్ రావిపూడి (డైరెక్టర్), తేజస్విని నందమూరి (అన్‌స్టాపబుల్ క్రియేటివ్ ప్రొడ్యూసర్), అజిత్ ఠాకూర్ (ఆహా డైరెక్టర్), రవికాంత్ సబ్నవిస్ (ఆహా CEO), రాజీవ్ చిలక (గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఫౌండర్) సహా పలువురు ప్రముఖులు ఈవెంట్ లో పాల్గొన్నారు.

ఈ  సందర్భంగా నటసింహం నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ..అందరికీ దసరా శుభాకాంక్షలు. గెలుపు అన్నది మన చేతుల్లోనే ఉంది. ఏదైతే కొత్తగా అనుకుంటామో ఆ జయం మనల్ని వరిస్తుంది. విజయానికి ప్రతీక ఈ దసరా శరన్నవరాత్రులు. అన్‌స్టాపబుల్‌ మొదలవడమే ఒక విస్పోటనం. విశ్వ విఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు గారు నాకు కేవలం తండ్రి గానే కాకుండా గురువుగా దైవంగా భావిస్తాను. ఆయన ఎంతో ముందు చూపుతో వినూత్నమైన చిత్రాలు, అద్భుతమైన పాత్రలు చేశారు. ఆయన స్ఫూర్తి తోనే అన్‌స్టాపబుల్‌ ప్రోగ్రాం చేయడం జరిగింది. ఈ షో కూడా వేరే ఎవరైనా అడిగి ఉంటే చేసేవాడిని కాదు. కేవలం అరవింద్‌గారి కోసమే ఒప్పుకొన్నా. అన్‌స్టాపబుల్‌ అండ్ టీమ్ అంతా ఒక కుటుంబ సభ్యులులా పనిచేస్తూ కష్టపడ్డాం. ఆ కష్టానికి ఫలితమే అన్‌స్టాపబుల్‌ సక్సెస్. ఐఎండీబీ వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో ఈ షో 18వ స్థానంలో వుంది. మన దేశంలోనే రీజినల్ లాంగ్వేజ్ లో నెంబర్ వన్ షోగా నిలిచింది. ఎంతో మంది హీరోలు, దర్శకులు, ప్రొడ్యూసర్లు మొదటి మూడు సీజన్ కి రావడం జరిగింది. వాళ్ళ మనసుల్లో మాటని ఎంతో ఓపెన్ గా పంచుకున్నారు. ఈ షో విజయంలో వారి పాత్ర వుంది. ప్రేక్షకులు ఏది కొత్తగా అనిపించినా దానికి ఆమోదం ముద్ర వేస్తారు. దాన్ని సక్సెస్ చేస్తారు. తెలుగు ప్రజలే కాకుండా యావత్ భారతదేశం ఈ షోకి నీరాజనాలు అందించింది. ఈ సందర్భంగా ప్రేక్షక దేవుళ్లకు, అన్ స్టాపబుల్ టీమ్ అందరికీ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా చిన్న కూతురు తేజస్విని క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా ఈ షోలో భాగం కావడం, స్క్రిప్ట్ రైటర్ రవి మచ్చ గారు, అలాగే టీం అంతా కూడా ఒక ఫ్యామిలీలా అహర్నిశలు కష్టపడ్డారు. ఎన్నో సినిమాలు కామిక్స్‌ రూపంలో వచ్చాయి. ‘అన్‌స్టాపబుల్‌’ మూడు సీజన్లు సక్సెస్‌ అయ్యాయి. అందుకే సీజన్‌-4 కొత్తగా అందించాలన్న ఉద్దేశంతో యానిమేషన్‌ రూపంలో ట్రైలర్‌ తీసుకొచ్చారు. రాజీవ్ అండ్ టీం చాలా అద్భుతంగా రూపొందించారు. సీజన్ 4 చాలా అద్భుతంగా వస్తుంది. ఎంత బాగుంటుందో ముందు ముందు మీరే చూస్తారు. అందరికీ కృతజ్ఞతలు’ తెలిపారు.

Show comments