NTV Telugu Site icon

వైరల్ అవుతున్న షారుఖ్ ఖాన్ త‌న‌యుడి ఫోటో!

సినిమా స్టార్స్ మాత్రమే కాదు… వాళ్ళ పిల్ల‌లు కూడా ఇవాళ సోష‌ల్ మీడియా పుణ్య‌మా అని సెల‌బ్రిటీస్ గా మారిపోయారు. తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ త‌న‌యుడి ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా వైర‌ల్ అయిపోతోంది. షారుఖ్, గౌరీఖాన్ పెద్ద‌కొడుకు ఆర్య‌న్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కొలంబియాలో ఫిల్మ్ మేకింగ్ లో కోర్సు చేస్తున్నాడు. ఇటీవ‌ల అత‌ను అక్క‌డి యూనివ‌ర్సిటీ నుండి ఫైన్ ఆర్ట్స్, సినిమాటిక్ ఆర్ట్స్ లో డిగ్రీ ప‌ట్టా పొందాడు. ఫిల్మ్ అండ్ టెలివిజ‌న్ ప్రొడ‌క్ష‌న్ స్కూల్ ఆఫ్ సినిమాటిక్ ఆర్ట్స్ లో డిగ్రీ ప్ర‌దానోత్స‌వం సంద‌ర్భంగా తీసిన ఓ ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో ర‌చ్చ చేస్తోంది. ఫిల్మ్ మేకింగ్ లో డిగ్రీ చేసిన ఆర్య‌న్… ఫిల్మ్ మేక‌ర్ గా మారాల‌నుకోవ‌డం మంచి ప‌ని అని కొంద‌రంటున్నారు. అయితే తండ్రిలానే అందంగా ఉంటే ఆర్య‌న్ హీరో అయితే బావుంటుంద‌నేది మ‌రికొంద‌రి కోరిక‌. కానీ ఆర్య‌న్ న‌ట‌న వైపు మొగ్గు చూపితే, తండ్రి షారుఖ్ ఖాన్ తో పొల్చే వార‌ని, సో ఇప్పుడు ఈత‌ను మెగా ఫోన్ ప‌ట్టాల‌నుకోవ‌డంతో ఆ స‌మ‌స్య ఉండ‌ద‌ని చెబుతున్నారు. ఇదిలా ఉంటే విదేశాల్లోనే ఫిల్మ్ మేకింగ్ అండ్ యాక్టింగ్ లో శిక్ష‌ణ తీసుకుంటున్న షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ మాత్రం హిందీ సినిమాల‌లో హీరోయిన్ గా లాంచ్ కావాల‌నే దృఢ నిశ్చ‌యంతో ఉన్న‌ట్టు తెలుస్తోంది. మొత్తానికి షారుఖ్ ఖాన్ వార‌సులు ఒక‌రి త‌ర్వాత ఒక‌రు ఈ రంగంలోకి వ‌చ్చేయ‌డం ఖాయం.