వైరల్ అవుతున్న షారుఖ్ ఖాన్ తనయుడి ఫోటో!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సినిమా స్టార్స్ మాత్రమే కాదు… వాళ్ళ పిల్లలు కూడా ఇవాళ సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీస్ గా మారిపోయారు. తాజాగా బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ తనయుడి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతోంది. షారుఖ్, గౌరీఖాన్ పెద్దకొడుకు ఆర్యన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కొలంబియాలో ఫిల్మ్ మేకింగ్ లో కోర్సు చేస్తున్నాడు. ఇటీవల అతను అక్కడి యూనివర్సిటీ నుండి ఫైన్ ఆర్ట్స్, సినిమాటిక్ ఆర్ట్స్ లో డిగ్రీ పట్టా పొందాడు. ఫిల్మ్ అండ్ టెలివిజన్ ప్రొడక్షన్ స్కూల్ ఆఫ్ సినిమాటిక్ ఆర్ట్స్ లో డిగ్రీ ప్రదానోత్సవం సందర్భంగా తీసిన ఓ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో రచ్చ చేస్తోంది. ఫిల్మ్ మేకింగ్ లో డిగ్రీ చేసిన ఆర్యన్… ఫిల్మ్ మేకర్ గా మారాలనుకోవడం మంచి పని అని కొందరంటున్నారు. అయితే తండ్రిలానే అందంగా ఉంటే ఆర్యన్ హీరో అయితే బావుంటుందనేది మరికొందరి కోరిక. కానీ ఆర్యన్ నటన వైపు మొగ్గు చూపితే, తండ్రి షారుఖ్ ఖాన్ తో పొల్చే వారని, సో ఇప్పుడు ఈతను మెగా ఫోన్ పట్టాలనుకోవడంతో ఆ సమస్య ఉండదని చెబుతున్నారు. ఇదిలా ఉంటే విదేశాల్లోనే ఫిల్మ్ మేకింగ్ అండ్ యాక్టింగ్ లో శిక్షణ తీసుకుంటున్న షారుఖ్ ఖాన్ కుమార్తె సుహానా ఖాన్ మాత్రం హిందీ సినిమాలలో హీరోయిన్ గా లాంచ్ కావాలనే దృఢ నిశ్చయంతో ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి షారుఖ్ ఖాన్ వారసులు ఒకరి తర్వాత ఒకరు ఈ రంగంలోకి వచ్చేయడం ఖాయం.
Also Read
- Venu Swamy : "నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!"!
- Jr NTR: ఒక్కడ్నీ వదలను.. మార్ఫింగ్ బ్యాచ్‌కు ఎన్టీఆర్ వార్నింగ్!
- Keerthy Suresh: లేడీ గ్యాంగ్‌స్టర్‌గా కీర్తి సురేశ్ ఊచకోత.. ఓటీటీ రిలీజ్ డేట్ లాక్!
- Aishwarya Lekshmi: బన్నీ - అట్లీ కాంబోలో ఈ బ్యూటీ లేనట్టే! అసలు సీక్రెట్ బయటపెట్టిన హీరోయిన్ ..
తాజావార్తలు
-
UP Election 2027: ‘‘150 కాదు.. కాంగ్రెస్‌కు 50 సీట్లే ఎక్కువ’’.. ఎస్పీ-కాంగ్రెస్ మధ్య ముదురుతున్న విభేదాలు!
-
Young Heroines : తల్లయితే తప్పేంటి?
-
Bollaram Army Weapons Theft: బొల్లారం ఆయుధాల చోరీలో బిగ్ ట్విస్ట్.. లోపలి వ్యక్తులే సూత్రధారులు
-
Venu Swamy : “నేను సన్నీ లియోన్ లాంటోడిని.. ఆల్రెడీ అన్నీ ఇప్పేసుకున్నా!”!
-
AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!