మళయళం తో పాటు తెలుగు, తమిళ, భాషల్లో నటించి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరో ఉన్ని ముకుందన్. అప్పటి వరకు మీడియం రేంజ్ లో ఉంటూ, తక్కువ బడ్జెట్ సినిమాలతో సర్దుకుంటూ వచ్చిన ఈ హీరో.. రీసెంట్ గా ‘మార్కో’ మూవీతో ఒక్కసారిగా ప్యాన్ ఇండియా స్టార్ గా మారిపోయాడు. ఆ మూవీ హిందీలోనూ బాగా ఆడటమే కాక అన్ని భాషలు కలిపి వంద కోట్ల గ్రాస్ సాధించింది. దీంతో ఉన్ని కి ఫ్యాన్స్ బెస్ ఒక సారిగా పెరిగిపోయింది. ఇక తాజాగా మార్కోకి పూర్తి భిన్నమైన కంటెంట్‌తో ‘గెట్ సెట్ బేబీ’ అనే మూవీతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఉన్ని ముకుందన్.
Also Read:Lavanya: శరవేగంగా సిద్ధమవుతున్న ‘సతీ లీలావతి’
అయితే ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ‘నేను ఎప్పుడు ముద్దు, శృంగార సన్నివేశాలకు దూరం ఉంటాను, దర్శకులు అడిగినా మొహమాటం లేకుండా నో చెప్పేస్తా’ అని ఉన్ని ఓ స్టేట్ మెంట్ పాస్ చేశాడు. అతని మాటలు ఒక్క సరిగా వైరల్ అయిపోయ్యాయి. దీని పై నెటిజన్లు ఒక్కోక్కరు ఒక్కోలా స్పందిస్తున్నారు. ‘ మీరు ఇచ్చిన స్టేట్ మెంట్‌లో తప్పు లేదు. కానీ ఉన్ని లాంటి ఫ్యామిలీ ఓరియెంటెడ్ హీరో ‘మార్కో’ లాంటి వైలెన్స్ మూవీస్ ఎంచుకున్నప్పుడు కొంచం ఆలోచించాలి’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఎందుకంటే ‘మార్కో’ లో వైలెన్స్ ఒళ్లు గగుర్పొడిచేలా ఉంటుంది. మరీ ఈ మధ్యకాలంలో జనాల ఆలోచనలో చాలా మార్పు వచ్చింది. రొమాన్స్ కన్నా వయొలెన్స్ ప్రభావం వారిపై ఎక్కువగా ఉంటుంది. రీసెంట్‌గా కూడా ఓ వెబ్ సిరీస్ చూసి హత్యలు చేయడం మనం చూశాం. దీని బట్టి హీరోలు వైలెన్స్ విషయంలో కొంచెం ఆలోచించి సినిమాలు తీస్తే మంచిది.