మలయాళ నటుడు ఉన్ని ముకుందన్ గురించి పరిచయం అక్కర్లేదు.టాలీవుడ్ లో జనతాగ్యారేజ్, ఖిలాడీ, యశోద వంటి సినిమాలతో ఇక్కడ కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రీసెంట్ గా హనీఫ్ అదేని దర్శకత్వంలో రూపొందిన ‘మార్కో’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చాడు ఉన్ని. గత ఏడాది డిసెంబరు 20న విడుదలై ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామి సృష్టించింది. తొలి ఏ రేటెడ్ మలయాళం మూవీగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ ‘మార్కో’ రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయింది. ఇప్పటి వరకు వయలెన్స్ అంటే ఎలా ఉంటుందో తెలియని మాలీవుడ్ కు ఇంట్రడ్యూస్ చేసిన హీరో ఉన్ని ముకుందన్. ఇందులో ప్రతి ఒక యాక్షన్ సన్నివేశాలు చూసి థియేటర్లలో జనాలు భయపడిపోయారు.
Also Read:Kiara Advani: మరో రెండు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ లతో రాబోతున్న బాలీవుడ్ బ్యూటీ..
దీంతొ ఉన్ని తదుపరి చిత్రం పై ప్రేక్షకులు వేట్ చేస్తున్నారు. కానీ ఉన్ని ఈ వైలెన్స్ సర్కిల్ లో ఉండాలనుకోవడం లేదట. ఈసారి సరికొత్త ప్రయోగానికి తెర లేపుతూ, ‘మార్కో’తో భయపెటిన ఉన్ని.. అప్ కమింగ్ ప్రాజెక్ట్ ‘గెట్ సెట్ బేబీ’ తో కితకితలు పెట్టిస్తానంటున్నాడు. వినయ్ గోవింద్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో నిఖిలా విమల్ హీరోయిన్ గా నటిస్తోంది.
ఇక ఎప్పుడో షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ నుంచి న్యూ అప్డేట్ పంచుకున్నారు మేకర్స్. ఈ సినిమాను స్కంద సినిమాస్, కింగ్స్ మాన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుండగా.. తాజాగా ఈ వెంచర్ లోకి ఎంట్రీ ఇచ్చింది ప్రముఖ నిర్మాణ సంస్థ ఆశీర్వాద్ సినిమాస్. ఈ సినిమా కేరళ రిలీజ్ హక్కులను సొంతం చేసుకుంది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఫక్తు ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా వస్తున్న ఈ మూవీలో శ్యామ్ సి ఎస్ బాణీలు అందిస్తున్నాడు. మరీ ‘మార్కో’ తో వైలెంట్ హీరోగా మారిన ఉన్ని.. ఈ సినిమాతో డీసెంట్ హీరోగా మారతాడా..? చూడాలి.