Site icon NTV Telugu

విడుదలకు సిద్ధమవుతున్న ఉదయ్ కిరణ్ చివరి మూవీ

Uday Kiran’s last film Chithram Cheppeina Katha direct OTT release

దివంగత నటుడు ఉదయ్ కిరణ్ అకాల మృత్యువాత పడి దాదాపు ఏడు సంవత్సరాలు అవుతోంది. ఆయన చివరగా నటించిన చిత్రం “చిత్రమ్ చెప్పిన కథ” ఎట్టకేలకు విడుదలకు సిద్ధమవుతోంది. 2015లోనే థియేటర్లలోకి రావలసిన ఈ చిత్రం కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. ఇది ఇప్పుడు డైరెక్ట్ డిజిటల్ రిలీజ్ కు సన్నద్ధమవుతోంది. “చిత్రమ్ చెప్పిన కథ” మేకర్స్ సినిమా విడుదల విషయమై ఇటీవల రెండు ఒటిటి ప్లాట్‌ఫామ్‌లతో చర్చలు జరిపారట. వారు ఈ ప్లాట్‌ఫారమ్‌ల నుండి ఆసక్తికరమైన ఆఫర్‌లను అందుకున్నట్లు తెలిసింది. ఈ వార్తలు గనుక నిజమైతే త్వరలోనే ఈ చిత్రం ఓటిటి ద్వారా ప్రేక్షకులను పలకరించనుంది. ఈ చిత్రం విడుదల గురించి ఉదయ్ కిరణ్ అభిమానులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

Exit mobile version