పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న వరుస చిత్రాల్లో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఒకటి. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా షూటింగ్ జోరుగా జరుగుతోంది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై గ్రాండ్‌గా నిర్మిస్తున్నా ఈ మూవీలో శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తున్న విషయం తెలిసిందే. ఆమె క్యారెక్టర్ నెవ్వర్ బిఫోర్ అనేలా పక్కింటి అమ్మాయి తరహాలో ఆకట్టుకుంటుందని సమాచారం. అయితే జూన్ 14న శ్రీలీల పుట్టినరోజు సందర్భంగా, మూవీ టీం రిలీజ్ చేసిన ఆమె స్పెషల్ పోస్టర్ ఫ్యాన్స్‌ను తెగ ఆకట్టుకుంది. ఆరెంజ్ చుడిదార్ డ్రెస్‌లో, చేతిలో కాఫీ కప్ పట్టుకుని రిలాక్స్ అవుతున్న స్టైల్‌లో కనిపించింది.
Also Read : Keerthi suresh : ‘ఉప్పు కప్పురంబు’ ట్రైలర్ రిలీజ్..
అలాగే సినిమాలో ఆమె పాత్ర ఎలా ఉంటుందా అన్న ఆసక్తి పెరిగింది.. అయితే ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా సెట్‌ల్లో కూడా శ్రీ లీలా తన 24వ పుట్టినరోజు జరుపుకుంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు తాజాగా బయటకు వచ్చాయి. కాగా సెలబ్రేషన్‌లో మూవీ టీం తో పాటు పవన్ కల్యాన్ కూడా ఉన్నారు. ప్రజంట్ ఈ పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇక శ్రీ లీల అప్ కమింగ్ మూవీస్ గురించి మాట్లాడుకుంటే.. ఈ ముద్దుగుమ్మ రవితేజ ‘మాస్ జాతర’ సినిమాతో పాటు అఖిల్ తో ‘లెనిన్’ అనే సినిమాతో బిజీగా ఉంది. తమిళ్ లో కూడా రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇక బాలీవుడ్ లో కూడా అవకాశాలు పెరిగే విధంగా అడుగులు వేస్తోంది. ‘ఆషికి 3’లో కార్తిక్ ఆర్యన్‌కు జోడిగా నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అమ్మడికి రానున్న రోజుల్లో ఎలాంటి అవకాశాలు అందుతాయో చూడాలి.
