Site icon NTV Telugu

రేప్ కేసులో టాలీవుడ్ నిర్మాతలు… కలకలం రేపుతున్న ముంబై మోడల్

Two Tollywood celebs listed in molestation charges

గతం కొంతకాలం క్రితం సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని మీటూ ఆరోపణలు కుదిపేసిన విషయం తెలిసిందే. ఇప్పటికీ ఎక్కడో ఒక చోట మీటూ ఆరోపణలు విన్పిస్తూనే ఉన్నాయి. తాజాగా ఒక మాజీ మోడల్ చేసిన రేప్ ఆరోపణల్లో టాలీవుడ్ నిర్మాతలు కూడా ఉండడం సంచలనంగా మారింది. ఈ ముంబై మోడల్ తొమ్మిది మంది ప్రముఖులపై లైంగిక వేధింపులపై ఆరోపణలు చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబై జోన్ 9 డిసిపి కార్యాలయం ఈ అంశంపై దర్యాప్తు చేసి, మే 26న బాంద్రా పోలీస్ స్టేషన్లో నిందితులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ జాబితాలో నటుడు జాకీ భగ్నాని, టి-సిరీస్ క్రిషన్ కుమార్, ఫోటోగ్రాఫర్ కోల్స్టన్ జూలియన్, క్వాన్ సహ వ్యవస్థాపకుడు అనిర్బన్ బ్లా, జెరోదా వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్, షీల్ గుప్తా, గుర్జోత్ సింగ్ ఉన్నారు. వారిలో టాలీవుడ్ కు చెందిన ఇద్దరు నిర్మాతలు కూడా ఉండడం గమనార్హం. బాధితురాలిని జాకీ భగ్నాని బాంద్రాలో వేధింపులకు గురి చేశాడని, శాంటాక్రూజ్‌లోని సంపన్నమైన రిసార్ట్‌లో నిఖిల్ కామత్ ఆమెను వేధించాడని ఎఫ్‌ఐఆర్ లో ఉంది. 2015లో అంధేరిలోని ఒక అపార్ట్‌మెంట్‌లో షీల్ గుప్తా లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని తెలుస్తోంది.

Exit mobile version