NTV Telugu Site icon

Nihtin: ఒకేసారి రెండు సినిమాలు.. ఈ సారైనా హిట్టు దక్కేనా..?

Untitled Design (9)

Untitled Design (9)

నితిన్ హిట్టు కొట్టి చాలా కాలం కావొస్తోంది. భీష్మ నితిన్ నుండి వచ్చిన లాస్ట్ హిట్. ఇటీవల కాలంలో మూడు సినిమాలు చేసాడు ఈ హీరో, కానీ వేటికవే డిజాస్టర్ లుగా మిగిలాయి తప్ప యావరేజ్ కూడా నిలబడలేక పోయాయి. కానీ ప్రస్తుతం ఈ యంగ్ హీరో వరుస సినిమాలతో షూటింగుల్లో బిజీ బిజీగా ఉన్నాడు.

నితిన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రాబిన్ హుడ్ అనే చిత్రంలో నటిస్తున్నాడు. గతంలో భీష్మ రూపంలో తనకు హిట్ ఇచ్చిన దర్శకుడుతో చేస్తున్న ఈ చిత్రంతో ఎలాగైనా హిట్ కొడతానని ధీమాగా ఉన్నడు నితిన్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉంది ఈ చిత్రం. మరోవైపు పవన్ కళ్యాణ్ తో వకీల్ సాబ్ వంటి సూపర్ హిట్ చిత్రాన్ని తెరకెక్కించిన శ్రీరామ్ వేణు డైరెక్షన్ లో తమ్ముడు అనే భారీ యాక్షన్ చిత్రంలో నటిస్తున్నాడు నితిన్.

ప్రస్తుతం రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్స్ లో యాక్షన్ ఘట్టాలను తెరకెక్కిస్తున్నారు. ఈ పోరాట సన్నివేశాలను సుమారు 70 మంది ఫైటర్స్ తో, ప్రీ క్లైమాక్స్ యాక్షన్ ఎపిసోడ్ షూట్ జరుగుతుందని తెలుస్తుంది. ఈ షెడ్యూల్ లో నితిన్, సప్తమి గౌడ, టెంపర్ వంశి తదితరులు పాల్గొంటున్నారు. ప్రస్తుతం 70 % షూట్ పూర్తియనట్టు సమాచారం. ఈ రెండు చిత్రాలతో సూపర్ హిట్ లు కొట్టి తనను ఫ్లాప్ ల నుండి గట్టెక్కిస్తాయని ధీమాగా ఉన్నాడు హీరో నితిన్. షూటింగ్ చివరి దశలో ఉన్న రాబిన్ హుడ్ చిత్రాన్ని డిసెంబర్ విడుదలకు ప్లాన్ చేస్తున్నారు నిర్మాతలు.

 

Also Read :Nani : సరిపోదా శనివారం బర్త్ డే గ్లిమ్స్ …సరిపోయిందా..?