Site icon NTV Telugu

Lobo : యాక్సిడెంట్ కేసులో ఆ టెలివిజన్ యాంకర్‌కు ఏడాది జైలు శిక్ష..

Lobo

Lobo

ప్రముఖ టెలివిజన్ యాంకర్ లోబో అలియాస్ మహమ్మద్ ఖయ్యూమ్ పై జనగామ కోర్టు కఠిన నిర్ణయం తీసుకుంది. రోడ్డు ప్రమాదం కేసులో ఆయనకు ఒక సంవత్సరం జైలు శిక్షతో పాటు రూ.12,500 జరిమానా విధించింది. 2018లో లోబో కారు నడుపుతూ హైదరాబాద్‌కు వస్తుండగా జనగామ జిల్లా నిడిగొండ వద్ద ఓ విషాద ఘటన జరిగింది. ఆయన కారు ఒక ఆటోను ఢీ కొట్టడంతో, ఆ ఆటోలో ఉన్న ప్రయాణికులు మేడె కుమార్, పెంబర్తి మణెమ్మలు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందారు. ఢీకొన్న తర్వాత కారు కూడా బోల్తా పడటంతో, లోబోతో పాటు కారులో ఉన్న పలువురికి తీవ్ర గాయాలు అయ్యాయి.

Also Read : Sridevi Drama Company Hyper Aadi: హైపర్ ఆది పంచ్‌పై వివాదం..

ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు జరిపారు. ఎన్నాళ్లుగానో సాగిన ఈ కేసులో, చివరికి కోర్టు తీర్పు వెలువరించింది. లోబో నిర్లక్ష్యంగా వాహనం నడపడం వల్లే ప్రమాదం జరిగిందని కోర్టు నిర్ధారించి, శిక్షను ప్రకటించింది. లోబో టెలివిజన్ రంగంలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న యాంకర్. షోలు, సినిమాల్లో కూడా తనదైన స్టైల్‌తో కనిపిస్తుంటాడు. అయితే ఈ తీర్పు ఆయన కెరీర్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి.

Exit mobile version