Tumbbad Rerelease Collections: ఈ మధ్య కాలంలో పాత సినిమాలను థియేటర్లలో రీ రిలీజ్ చేసి సక్సెస్ అవుతున్నారు మేకర్స్. ఈ క్రమంలో ఈ ఏడాది రీ-రిలీజ్ చిత్రాలలో ఇండియాలో తుంబాద్ కలెక్షన్లలో అగ్రస్థానంలో నిలిచింది. ఈ సినిమా రీ-రిలీజ్ లో అంచనాలకు మించిన విజయం సాధించింది. తుంబాద్ రీ-రిలీజ్ లో ప్రపంచవ్యాప్తంగా మొత్తం రూ.35 కోట్లు రాబట్టింది. నిజానికి ముందుగా తుంబాద్ 2018లో విడుదలైంది. తుంబాద్ బడ్జెట్ అప్పట్లో కేవలం రూ.5 కోట్లు. అయితే ఈ సినిమా ప్రేక్షకుల ఆదరాభిమానాలను అందుకోగలిగినప్పటికీ ఆ రోజుల్లో మొత్తం 16 కోట్లు మాత్రమే రాబట్టినట్లు సమాచారం. రాహి అనిల్ బార్వే దర్శకత్వం వహించిన ఈ సినిమా షూటింగ్ మహారాష్ట్రలోని తుంపదెన్న గ్రామంలో జరిగింది. విజువల్ ఎఫెక్ట్స్‌పై పెద్దగా ఆధారపడ లేదు.
Tulsi Kumar: షూటింగ్‌లో ఘోర ప్రమాదం: వెంట్రుక వాసిలో తప్పించుకున్న నటి.. వీడియో వైరల్
తుంబాద్ వర్షంతో సహా వాస్తవికంగా చిత్రీకరించబడింది. అందుకోసం నాలుగు వర్షాకాల సీజన్లలో సినిమాను చిత్రీకరించారు. సోహమ్ షా, హర్ష్ కె తదితరులతో పాటు, జ్యోతి మల్షే, రుద్ర సోని, మాధవ్ హరి, పియూష్ కౌశిక్, అనిత, దీపక్ దామ్లే, కామెరాన్ ఆండర్సన్, రోజినీ చక్రవర్తి మరియు సోహమ్ షా ప్రధాన నిర్మాతలుగా కనిపించారు. పంకజ్ కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు. అజయ్-అతుల్ సంగీతం అందించగా మితేష్ షా మరియు ఆనంద్ గాంధీతో పాటు, రాహి అనిల్ బర్వేతో కలిసి మితేష్ షా కూడా సినిమా స్క్రిప్ట్ అందించారు. భారతదేశంలో శతాబ్దాలుగా ప్రచారంలో ఉన్న ఓ పురాణగాథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఒకరకంగా ఈ తుంబాద్ ఒక నిధి వేట కథను చెబుతుంది. మనిషి ఆకలి అతన్ని ఎలా నాశనం చేస్తుందో కూడా ఈ సినిమా కళ్లకు కట్టింది. ఇక రీ రిలీజ్ సమయంలోనే ఈ సినిమాకి సీక్వెల్ అనౌన్స్ చేయడంతో సినిమా అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.