Site icon NTV Telugu

Trump : అతిథి పాత్రలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..

Us President Trump,chris Columbus

Us President Trump,chris Columbus

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ గురించి రోజుకో వార్త వింటూనే ఉంటాం. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఆయన తీసుకునే కీలక నిర్ణయాలతో తీవ్ర విమర్శలు ఎదుర్కొంటు ఉన్నాడు. అక్కడి ప్రజలే కాదు.. ట్రంప్ బెదిరింపులతో ఆ దేశానికి వెళ్లడానికి భారతీయులతో పాటు విద్యార్థులు భయపడుతున్నారు. ఇక రాజకీయాల విషయం పక్కన పెడితే తాజాగా ట్రంప్‌ను ఉద్దేశించి అమెరికన్ ఫిల్మ్ మేకర్ క్రిస్ కొలంబస్    షాకింగ్ విషయాలు పంచుకున్నాడు.

Also Read: Lokesh : ఆ స్టార్ హీరోతో మూవీ చేయడం లోకేష్ కనకరాజ్ గోల్ ..?

క్రిస్ కొలంబస్ దర్శకత్వంలో 1992లో తెరకెక్కిన ‘హోమ్ అలోన్ 2 : లాస్ట్ ఇన్ న్యూయార్క్’ అనే మూవీ మంచి హిట్ అందుకుంది. అమెరికన్ క్రిస్మస్ కామెడీ ఫిల్మ్ గా తెరకెక్కిన ఈ సినిమాలో డొనాల్డ్ ట్రంప్ అతిథి పాత్రలో నటించారు. వినడానికి షాకింగ్ గా ఉంది కదా. అయితే దీనిపై తాజాగా దర్శకుడు క్రిస్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘నేను ‘హోమ్ అలోన్ 2 : లాస్ట్ ఇన్ న్యూయార్క్’ మూవీలో ఆయన్ని తీసుకోకుండా ఉండాల్సింది.. ఇది నాకొక పెద్ద సమస్యగా మారింది. అప్పటికి ఆయన నటించిన సన్నివేశాలు తొలగించాలని అనుకున్నా. కానీ అది కుదరదు. ఎందుకంటే అలా చేస్తే నన్ను ఈ దేశం నుంచి నన్ను బహిష్కరించేవారు. నాకు ఇక్కడ జీవించే హక్కు లేదని బయటకు పంపించేవారు. దాంతో నేను ఇటలీ లేదా మరో దేశానికి తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చేది’ అని ఆయన తెలిపారు. అలాగే గతంలో ఈ మూవీని ఉద్దేశించి ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై క్రిస్ కొలంబస్ మాట్లాడారు.. ‘ఈ సినిమాలో నటించమని కోరుతూ చిత్రబృందం తన వెంట పడింది అని ట్రంప్ చేసిన కామెంట్స్‌లో ఎలాంటి నిజం లేదు. అది పూర్తిగా అబద్ధం. సినీ పరిశ్రమతో సంబంధం లేని ఒక వ్యక్తిని నా ప్రాజెక్ట్ లో భాగం చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు.. ఇందులో యాక్ట్ చేయాలని ట్రంప్ ఎంతో ఆసక్తి చూపించారు.. అందుకే ఆయన్ని 7 సెకన్ల సీన్ కోసం తీసుకున్నాం’ అని తెలిపారు క్రిస్ కొలంబస్.

Exit mobile version