Trolls on Devara Movie Latest Poster: ఈ సోషల్ మీడియా జమానాలో చిన్న పొరపాటు చేసిన ఈజీగా దొరికిపోతున్నారు సినిమా మేకర్లు. ఈ నేపథ్యంలోనే తాజాగా రిలీజ్ చేసిన దేవర సినిమా పోస్టర్ గురించి చాలా ట్రోల్స్ వస్తున్నాయి. అసలు విషయం ఏమిటంటే దేవర సినిమా సెప్టెంబర్ 27వ తేదీన ప్రేక్షకులు ముందుకు రాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ కూడా మొదలుపెట్టింది సినిమా యూనిట్. మిగతా సినిమాలతో పోలిస్తే ప్రమోషన్లలో కాస్త వెనకబడే ఉందని చెప్పచ్చు. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన సింగిల్ ఐదో తేదీన రిలీజ్ చేయబోతున్నామంటూ ఒక పోస్టర్ రిలీజ్ చేశారు.
Raj Tarun: అరియానాని ప్రెగ్నెంట్ చేసిన రాజ్ తరుణ్.. మరో సంచలనం తెరమీదకు
ఆ పోస్టర్లో జాన్వీ కపూర్ ఎన్టీఆర్ ఇద్దరూ హగ్ చేసుకుని ఉన్నట్టు కనిపిస్తోండగా ఒక మంచి రొమాంటిక్ పోజ్ లో నిలబడి కనిపిస్తున్నారు. అయితే ఈ పోస్టర్ ఎడిటింగ్ విషయంలో ట్రోల్స్ మొదలయ్యాయి. అదేంటంటే ఎన్టీఆర్ కాళ్లు ఈ పోస్టర్ లో కనిపించడం లేదు. దీంతో పెద్ద ప్రొడక్షన్ హౌస్, ఒక పాన్ ఇండియా హీరో, బాలీవుడ్ నుంచి తెచ్చుకున్న హీరోయిన్ లు ఉండగా పోస్టర్ విషయంలో ఇంత అజాగ్రత్తగా ఎలా ఉన్నారంటూ అభిమానులతో పాటు సామాన్య నెటిజన్లు కూడా ప్రశ్నిస్తున్నారు. నిజానికి ఇంతకుముందు రిలీజ్ చేసిన పోస్టర్లో కూడా ఇదే పొరపాటు జరిగిందని దాన్ని ఇప్పుడు కూడా సరిహద్దుకోకపోతే ఎలా అని కామెంట్లో వినిపిస్తున్నాయి.