ప్రశాంత్ నీల్ ను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
పాన్ ఇండియా మూవీ కెజిఎఫ్‌తో దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు దర్శకుడు ప్రశాంత్ నీల్. అతనితో సినిమాలు చేయడానికి కన్నడ స్టార్స్ సంగతి ఏమో కానీ మన టాలీవుడ్ యంగ్ హీరోలు మాత్రం క్యూ కడుతున్నారు. ఇప్పటికే ప్రభాస్… ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో సలార్ మూవీ చేస్తుంటే… మరికొందరు స్టార్ హీరోలు తమ ప్రాజెక్టులకు సంబంధించిన ప్రకటనలు చేశారు. ఇదిలా ఉంటే… ఈ మోస్ట్ పాపులర్ డైరెక్టర్ ఇవాళ కొవిడ్ 19కు తొలి డోస్ వాక్సిన్ వేయించుకున్నాడు. నర్స్ సూది గుచ్చుతుంటే… భయంతో ప్రశాంత్ నీల్ కళ్ళు మూసుకున్నాడు. ఈ ఫోటోను అతను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగానే నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకోవడం మొదలెట్టారు. నర్సు దగ్గర సింపతీ కోసమా? అని కొందరు ప్రశ్నిస్తే, నటనలో మీకు ఆస్కార్ ఇవ్వొచ్చు అని మరికొందరు ఆట పట్టించారు. వయొలెన్స్ చిత్రాలు తీసే మీకు ఇంజెక్షన్ అంటే భయమా అని ఆశ్చర్యపోతూ మీమ్స్ ను క్రియేట్ చేశారు మరికొందరు. ఇవన్నీ మాకెందుకు కేజీఎఫ్-2కి సంబంధించి అప్ డేట్ ఇవ్వండీ అని మరికొందరు వాపోయారు. ఇంకొందరైతే మీలాంటి సెలబ్రిటీస్ కు వాక్సిన్ దొరుకుతుంది. మాకు మాత్రం దొరకడం లేదంటూ విమర్శించారు. తెర మీద మీరు చూపించే వయొలెన్స్ కు, ఈ ఎక్స్ ప్రెషన్ కూ ఏమైనా సంబంధం ఉందా? అని కొందరు ఉడికించారు. కేజీఎఫ్ -2లో కీలక పాత్ర పోషిస్తున్న రవీనా టాండన్ సైతం ప్రశాంత్ నీల్ ను సరదాగా ఆటపట్టించడం విశేషం.
Also Read
తాజావార్తలు
-
Aadi Saikumar : ఆది సాయికుమార్ కొత్త సినిమా అనౌన్స్మెంట్: ‘శంభల’ టీమ్‌తో మరో క్రేజీ ప్రయోగం!
-
TTE Suspended: రూ. 700 వందే భారత్ టికెట్ రూ. 380కి.. వైరల్ వీడియోతో TTE సస్పెండ్..!
-
Import Duty Charges increased: పసిడి, వెండి ప్రియులకు షాక్.. దిగుమతి సుంకాలు పెంపు.. నేటి నుంచే అమలు..!
-
Akshay Kumar: దిల్ రాజు – అక్షయ్ కుమార్ మూవీ రిలీజ్ డేట్ ఖరారు..
-
Shubman Gill: “మా ప్లాన్ వర్కవుట్ అయింది”.. హైదరాబాద్‌పై భారీ విజయం తర్వాత గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Matt Berger Fossil Discovery : కుక్క వెంట పరిగెత్తి.. 20 లక్షల ఏళ్ల రహస్యం బయటపెట్టిన బాలుడు.!
-
Met Gala 2026 : బంగారు కాళ్లతో మెరిసిన మోడల్.. ప్రాణాల మీదకు తెచ్చిన ఆ ఒక్క పొరపాటు.!
-
క్లచ్ లేకుండానే గేర్ మార్పులు.. ఈ-క్లచ్ టెక్నాలజీతో Honda NX500 లాంచ్..
-
స్టైలిష్ లుక్ + పవర్ ఫుల్ బ్యాటరీతో లాంచ్ కు సిద్దమైన Realme 16T 5G.!
-
TVK Floor Test: మద్రాస్ హైకోర్టు సంచలన తీర్పు.. బలపరీక్షకు ముందే టీవీకేకు కోలుకోలేని దెబ్బ!