Site icon NTV Telugu

Mahesh Babu : అదే హైలెట్.. అప్పుడే రిలీజ్..!

Trivirkam Mahesh Rajamouli

Trivirkam Mahesh Rajamouli

మహేష్ బాబు అప్ కమింగ్ ఫిల్మ్స్ త్రివిక్రమ్.. రాజమౌళి.. దర్శకత్వంలో రాబోతున్న సంగతి తెలిసిందే. ముందుగా త్రివిక్రమ్ ప్రాజెక్ట్ ఫినిష్ చేసి.. రాజమౌళితో సినిమా మొదలెట్టేందుకు రెడీ అవుతున్నాడు మహేష్. అయితే తాజాగా ఈ రెండు సినిమాల గురించి.. ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తోంది. త్రివిక్రమ్ సినిమాలో అదే హైలెట్ అంటూ ఓ వార్త రాగా.. రాజమౌళి సినిమా రిలీజ్ అప్పుడే అంటున్నారు. ఇంతకీ ఏంటా హైలెట్.. రిలీజ్ ఎప్పుడు..!

ప్రస్తుతం ఫారిన్ వెకేషన్లో ఉన్న మహేష్ బాబు.. తిరిగొచ్చాక త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌లో జాయిన్ అవబోతున్నారు. జూలై సెకండ్ వీక్ నుంచి SSMB28 షూటింగ్ మొదలు పెట్టడానికి ప్లాన్ చేస్తున్నారు. దాంతో మాటల మాంత్రికుడు ప్రి ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నాడు. రీసెంట్‌గా మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా స్టార్ట్ చేశారు తమన్. ఇక పూజాహెగ్డే హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో.. మహేష్ రోల్ గురించి రకరకాల కథనాలు వస్తున్నాయి. ఈ సినిమా పీరియాడిక్ డ్రామా అని, ఫ్లాష్ బ్యాక్, లైవ్ సమానంగా సాగుతాయని.. మహేష్ డ్యూయెల్ రోల్‌లో కనిపించబోతున్నాడని తెలుస్తోంది. ముఖ్యంగా సెకండ్ హాఫ్ లో వచ్చే మహేష్ రెండో క్యారెక్టర్ సినిమాకే హైలైట్‌గా నిలవనుందట. ఇక ఈ సినిమా అయిపోగానే రాజమౌళి సినిమా కోసం దాదాపు రెండేళ్లు కేటాయించనున్నాడు మహేష్.

ప్రస్తుతం స్క్రిప్టు పనుల్లో బిజీగా ఉన్న రాజమౌళి.. ఈ ఏడాది మొత్తం స్క్రిప్ట్ వ‌ర్క్‌కే టైమ్ కేటాయించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఏడాది ప్రారంభంలో షూటింగ్ మొద‌లుపెట్టి .. ఇయర్ ఎండింగ్‌లో పూర్తిచేసేలా ప్లాన్ చేస్తున్నారట. ఈ లెక్క‌న ఈ సినిమా 2024లో రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. ఇక ఈ సినిమా కథతో పాటు.. విలన్‌.. హీరోయిన్‌.. బడ్జెట్‌ విషయాల్లో పలు పుకార్లు షికార్లు చేస్తునే ఉన్నాయి. ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతోందని.. ఓ స్టార్ హీరో విలన్‌గా నటిస్తున్నాడని.. బాలీవుడ్ బ్యూటీ హీరోయిన్‌గా ఫిక్స్ అయిందని ప్రచారం జరుగుతోంది. అయితే ఇలాంటి వార్తల్లో క్లారిటీ రావాలంటే.. అఫిషీయల్ అనౌన్స్మెంట్ వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.

Exit mobile version