Site icon NTV Telugu

Trisha : అసహ్యం వేస్తుంది ఫేక్ న్యూస్ ఆపండి – త్రిష సీరియస్ వార్నింగ్

Trisha

Trisha

సౌత్ ఇండస్ట్రీలో రెండు దశాబ్దాలుగా స్టార్‌గా వెలుగొందుతున్న సీనియర్ హీరోయిన్ త్రిష, తరచూ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పుకార్లతో ఇబ్బందులు పడుతూ ఉంటుంది. ఇటీవల మళ్లీ పెళ్లి రూమర్స్ హాట్ టాపిక్‌గా మారాయి. 41 ఏళ్లు దాటుతున్నా త్రిష ఇంకా సింగిల్‌గానే ఉండటం ఒకపక్క సినిమాలు చేస్తూనే ఉండటం ఈ ఊహాగానాలకు మరింత వేడి పుట్టిస్తోంది. కొన్ని సంవత్సరాల క్రితం హీరో విజయ్‌తో త్రిషకు సీక్రెట్ రిలేషన్ ఉందని వచ్చిన వార్తలు సోషల్ మీడియాలో పెద్ద హంగామా చేశాయి. ముఖ్యంగా విజయ్ పుట్టినరోజు రోజున బయటకు వచ్చిన ఒక ఫోటో విజయ్ చేతిలో కుక్కపిల్ల (ఇజ్జి), పక్కన కూర్చొని నవ్వుతున్న త్రిష ఈ రూమర్స్‌కు మరింత ఊపును తెచ్చింది. “ఇద్దరి మధ్య ఏదో ఉంది” అంటూ అప్పట్లో బాగా వైరల్ అయింది. అయితే ఇలాంటి వార్తల పై తాజాగా త్రిష తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు టాలీవుడ్ సర్కిల్‌లో వార్తలు వినిపిస్తున్నాయి..

Also Read : Manchu Lakshmi : బొడ్డు కనిపిస్తే తప్పేంటి? టాలీవుడ్ కల్చర్‌పై మంచు లక్ష్మి హాట్ కామోంట్స్..

ఇండస్ట్రీలో చాలా మంది తో తనకు స్నేహం మాత్రమే ఉందని, కానీ వారందరినీ తన భర్తలుగా మీడియా చూపించడం పూర్తిగా తప్పుడు పని అని ఆమె తీవ్రంగా మండిపడినట్లు తెలుస్తోంది. “స్నేహితులతో ఉన్న ఫోటోలను చూసి పెళ్లి వార్తలు రాయడం అసహ్యం వేస్తుంది. దయచేసి ఫేక్ న్యూస్ ప్రచారం ఆపండి” అని త్రిష క్లియర్ వార్నింగ్ ఇచ్చిందని అంటున్నారు. ప్రస్తుతం త్రిష పూర్తి స్థాయిలో సినిమాల పైనే దృష్టి పెట్టిందనీ, వ్యక్తిగత విషయాల గురించి యాదృచ్ఛికంగా రూమర్స్ సృష్టించడం వల్ల తన ఇమేజ్ దెబ్బతింటుందని ఆమె స్పష్టం చేసినట్లు సమాచారం. ప్రజంట్ మెగాస్టార్ చిరంజీవి – వశిష్ట్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘విశ్వంభర’ లో కీలక పాత్రలో నటిస్తోంది.

Exit mobile version