Site icon NTV Telugu

Trisha : త్రిష‌కు అద్భుతంగా ప్రపోజ్ చేసిన అభిమాని..

Trisha

Trisha

ముద్దు గుమ్మ త్రిష గురించి టాలీవుడ్ ప్రేక్షకుల‌కు పరిచయం అక్కర్లేదు. చెన్నై అమ్మడు అయినప్పటికి తెలుగు చిత్రాల ద్వారా స్టార్ హీరోయిన్ గా గుర్తింపు సంపాదించుకుందనే చెప్పాలి. ఇక్కడ దాదాపు అందరు స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించిన ఈ అమ్మడు రెండు దశాబ్దాలుగా తన అందంతో, అభినయంతో ప్రేక్షకులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇప్పటికీ తెలుగుతో పాటు తమిళ, మలయాళ సినిమాల్లో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకుంటూ దూసుకుపోతున్నత్రిష, ప్రస్తుతం  చిరంజీవి స‌ర‌స‌న ‘విశ్వంభ‌ర’ అనే చిత్రం చేస్తుంది. సాధార‌ణంగా చెప్పాలంటే సెకండ్ ఇన్నింగ్స్‌లో అవ‌కాశాలు రావ‌డం చాలా అరుదు. కాని త్రిష మాత్రం అద్భుత‌మైన అవ‌కాశాలు అందుకుంటుంది. ఇదిలా ఉంటే ఫేవరెట్ హీరో గాని హీరోయిన్ పై అభిమానులు వారి అభిమానాన్ని నానా రకాలుగా వ్యక్తం చేస్తుంటారు. ఇందులో భాగంగా తాజాగా త్రిష‌కు ఓ అభిమాని చేసిన ప్రపోజ్ ప్రజంట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది..

Also Read : Jayam Ravi : బాధ్యత లేకుండా తిరుగుతున్నాడు .. స్టార్ హీరో వైఫ్ పోస్ట్ వైరల్

త్రిష అందాన్ని పొగుడతూ తన మ‌న‌సులో ప్రేమ‌ను బ‌య‌ట పెట్టాడు. హీరోయిన్ లకు ఎన్నో ల‌వ్ ప్రపోజ‌ల్స్ వ‌స్తుంటాయి. కాని ఈ ప్రపోజ‌ల్ మాత్రం త్రిష త‌ప్పక అంగీక‌రించాల్సిందే. అంత గొప్పగా ప్రేమ‌ను కురిపించాడు.. ‘ముంతాజ్ ప్రేమ‌కు గుర్తుగా తాజ్ మ‌హాల్‌ని క‌ట్టారు. కానీ దాన్ని త‌ల‌దన్నేలా అంత‌కు మించిన గొప్ప ప్రేమ మందిరం ఇప్పటికే నా మ‌న‌సులో క‌ట్టేసాను. కానీ దాన్ని నేను భౌతికంగా చూపించలేను కాబ‌ట్టి తాజ్ మహ‌ల్‌ని మించిన మ‌రో మందిరం క‌ట్టి చూపిస్తాను. అది నాకు ఈ జ‌న్మలో సాధ్యం కాక‌పోయినా వ‌చ్చే జ‌న్మలోనైనా తప్పక క‌డ‌తాన’ అంటూ మ‌నసులో ప్రేమ‌ను వ్యక్తం చేసాడు ఓ అభియాని. ఇది క‌నుక త్రిష చూస్తే మైమ‌రిచిపోవ‌డం ఖాయం.

Exit mobile version