Site icon NTV Telugu

Deepika Padukone: దీపిక త్యాగాన్ని గుర్తించి.. సపోర్ట్‌గా నిలిచిన త్రిప్తి

Deepika Dimry

Deepika Dimry

బాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్ల కెరీర్‌ ఎప్పటికప్పుడు అప్స్ అండ్ డౌన్‌లతో సాగుతుంది. తాజాగా దీపికా పదుకొణె వరుస ప్రాజెక్టుల నుండి తప్పుకోవడం, అలాగే ‘స్పిరిట్‌’లో ఆమె స్థానంలో త్రిప్తి డిమ్రీని ఎంపిక చేయడం ఇండస్ట్రీలో పెద్ద చర్చకే దారితీసింది. దీని వల్ల వీరిద్దరి మధ్య గ్యాప్‌ వచ్చిందంటూ గాసిప్స్‌ గాలం విసిరాయి. కానీ, ఈ రూమర్లకు త్రిప్తి సైలెంట్‌గానే సమాధానం ఇచ్చేసింది.

Also Read : Aamir Khan : మా మధ్య దూరం పెరగడానికి కారణం నేనే.. విడాకులపై స్పందించి అమీర్ ఖాన్

ఓ ఫ్యాన్‌ సోషల్ మీడియాలో దీపికా అంకితభావాన్ని గుర్తు చేస్తూ ఓ పోస్ట్ పెట్టాడు.. ‘రామ్‌లీలా’లో ఒక పాట కోసం 30 కేజీల బరువున్న లెహెంగా వేసుకుని డ్యాన్స్ చేసిన ఆమె కష్టాన్ని, కాలికి గాయమై రక్తం వచ్చినా కూడా ఆగకుండా షూట్ కొనసాగించిన దీపికా డెడికేషన్‌ని వివరించారు. ఈ పోస్ట్‌ను త్రిప్తి లైక్ చేయడంతో, దీపికా కోసం తన సపోర్ట్‌ను పరోక్షంగా చూపించినట్టే అయింది. దీంతో అభిమానులు మరింత ఎమోషనల్‌ అయ్యారు. “త్రిప్తి గుడ్ హార్ట్‌డ్, దీపికా ఎప్పటికీ క్వీన్‌” అంటూ నెటిజన్లు రెస్పాన్స్ ఇస్తున్నారు. ఆమె ఈ విధంగా దీపికకు అండగా నిలవడం నిజంగా అభిమానులకు హృదయానికి హత్తుకునే విషయమే.

 

Exit mobile version