Site icon NTV Telugu

Tripti : ఆ పాత్రే నాకు ధైర్యం నేర్పింది..

Tripthi

Tripthi

బాలీవుడ్ టాలెంటెడ్ బ్యూటీ త్రిప్తి దిమ్రీ ‘ధడక్ 2’ చిత్రంతో మరోసారి ఆకట్టుకునేందుకు సిద్ధమవుతోంది. సిద్ధాంత్ చతుర్వేది సరసన ఆమె నటించిన ఈ ప్రేమకథా చిత్రానికి షాజియా ఇక్బాల్ దర్శకత్వం వహించారు. ఇందులో త్రిప్తి ‘విధి’ అనే పాత్రలో కనిపించనుంది.తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న త్రిప్తి, ఈ పాత్ర గురించి తనపై కలిగిన ప్రభావాన్ని  వివరించింది.

Also Read : Sathileelavathi: ‘సతీ లీలావతి’ టీజర్‌కు టైమ్ ఫిక్స్.. ఎప్పుడంటే?

‘ ‘ధడక్ 2’ లోని విధి పాత్ర కారణం లేకుండా అంగీకరించలేదు.. ఆ పాత్ర ఎంతో ధైర్యవంతంగా ఉంటుంది. నిజం చెప్పడంలో భయపడదు. నిజ జీవితంలో నేను ఎంతో కొంత మౌనంగా ఉండే దాన్ని. ఎన్నో విషయాల్లో స్పందించలేక వెనకడుగేసేదాన్ని. కానీ ఈ పాత్ర నా ఆలోచనా విధానాన్ని మార్చేసింది. ఈ సినిమా పూర్తయ్యే సరికి, ఎవరికీ భయపడకుండా ధైర్యంగా మాట్లాడే గుణం నాలో ఏర్పడింది. విధిలా జీవించాలనే ఆలోచన, నాకు నా నిజమైన శక్తిని గుర్తు చేసింది. ఈ చిత్రం నా వ్యక్తిత్వాన్ని, కెరీర్‌ని కొత్త దారిలో నడిపించిందని నమ్ముతున్నా” అని త్రిప్తి పేర్కొంది. కాగా ఈ చిత్రంలో త్రిప్తి ప్రదర్శించబోయే భావోద్వేగాలు, ఆత్మవిశ్వాసం ప్రేక్షకులకు ఎంతవరకు కనెక్ట్ అవుతాయో చూడాలి. ఇప్పటికే ‘కలా’, ‘బుల్బుల్’, ‘ఎనిమీ’ వంటి చిత్రాలతో మంచి నటిగా పేరొందిన త్రిప్తి, ‘ధడక్ 2’ ద్వారా తన పరిధిని మరింత విస్తరించనున్నట్లు కనిపిస్తుంది.

Exit mobile version