Site icon NTV Telugu

Toxic: అబ్బే… చెప్పిన డేటుకు కష్టమే

Toxic

Toxic

కేజీఎఫ్ సినిమాతో సూపర్ క్రేజ్ అందుకున్న యష్, ఆ తర్వాత దాని సీక్వెల్ కేజీఎఫ్ టూ తో మరింత క్రేజ్ సంపాదించాడు. ఆ సిరీస్ తర్వాత మనోడు ఎలాంటి సినిమా చేస్తాడని కేవలం కన్నడ ఆడియన్స్ మాత్రమే కాదు, ఇండియా వైడ్ ఆడియన్స్ అందరూ ఎదురు చూస్తున్నారు. అలాంటి తరుణంలో టాక్సిక్ అనే సినిమా మొదలుపెట్టాడు. గీతు మోహన్ దాస్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ముందు నుంచి అనేక ఇబ్బందుల్లో చిక్కుకుంటుంది. ముఖ్యంగా సినిమా షూట్ విషయంలో యష్ జోక్యం చేసుకుంటున్నాడనే వార్తలు ముందు నుంచి వస్తూనే ఉన్నాయి. అవుట్‌పుట్ నచ్చకపోవడంతో మళ్లీమళ్లీ రీ-షూట్ చేయాల్సిందిగా కోరుతున్నాడని కూడా వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు సినిమా ప్రొడక్షన్ ఇష్యూస్‌లో చిక్కుకున్నట్లుగా తెలుస్తోంది. నిజానికి గీతూ మోహన్దాస్ స్టైల్ వేరు, యష్ ఇమేజ్ వేరు. వీరిద్దరూ కలిసి సినిమా చేస్తున్నామన్నప్పుడే అనేక అనుమానాలు వచ్చాయి.

Also Read :Jaanvi Swarup: హీరోయిన్’గా మహేష్ బాబు మేనకోడలు ఎంట్రీ

కానీ ఇద్దరూ కొత్తగా ట్రై చేస్తున్నారేమో అని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు సినిమా షూట్ తర్వాత తీసిన ఫుటేజ్ యష్‌కి నచ్చడం లేదట. సినిమా చూసుకున్న తర్వాత యష్ సినిమాలో ఇంకా మాస్ కంటెంట్ కావాలని, తనకున్న పాన్ ఇండియా ఫ్యాన్ బేస్ సాటిస్ఫై అయ్యే కంటెంట్ కావాలని కోరుతున్నారట. కేవీఎన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ సినిమా యష్-డైరెక్టర్ గీతు క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా అనుకున్న డేట్‌కి అంటే మార్చి 9వ తేదీకి రిలీజ్ కావడం కష్టమే. అందుకే అడవి శేష్ డిసెంబర్ నుంచి తన డెకాయిట్ సినిమాని ఈ రిలీజ్ డేట్‌కి వాయిదా వేసుకున్నట్టుగా నిన్న అధికారికంగా ప్రకటించారు. అందరూ టాక్సిక్ సినిమాతో పోటీకి దిగుతున్నాడేమో అనుకున్నారు. కానీ టాక్సిక్ రావడం కష్టమేనని తెలిసినాకే డెకాయిట్ రంగంలోకి దిగాడన్నమాట.

Exit mobile version