నాని నిర్మిస్తున్నాడన్న వెయిటేజ్ తప్ప ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్ అందుకున్న సినిమా ‘కోర్ట్ స్టేట్ వర్సస్ ఏ నోబడీ’. హర్ష రోషన్, శ్రీదేవి హీరో హీరోయిన్లుగా ప్రియదర్శి కీ రోల్‌గా తెరకెక్కన కోర్టు మూవీ సూపర్ హిట్ అయింది. కోర్ట్ రూమ్ డ్రామాగా వచ్చిన ఈ మూవీ విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి సైతం మూవీ టీంని ఇంటికి పిలిచి మరీ అభినందించారు. ఈ మూవీటీంని ప్రశంసిస్తూ కోలీవుడ్ స్టార్ కపుల్ సూర్య అండ్ జ్యోతిక యాక్టర్లకు స్పెషల్ గిఫ్ట్ పంపారు
Also Read : Kubera : ఓటీటీలో అంతగా చప్పుడు చేయని ‘కుబేర’
చందు, జాబిల్లి క్యారెక్టర్లకు రోషన్, శ్రీదేవి ఎంత పేరొచ్చిందే లాయర్ పాత్రలో ప్రియదర్శి మరోసారి తన మార్క్ చూపించాడు. మంగపతి క్యారెక్టర్లలో శివాజీ ఫెర్మామెన్స్ మూవీకే హైలైట్. ఇక ఇందులో కథలెన్నో చెబుతారు సాంగ్ యూత్‌కి బాగా కనెక్ట్ అవ్వడంతో చార్ట్ బస్టర్‌గా నిలిచింది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా డైరెక్టర్ రామ్ జగదీష్ తెరకెక్కించాడు. సుమారు 10 కోట్లతో నిర్మించిన కోర్ట్ తొలి రోజే రూ. 8 కోట్లను రాబట్టుకుంది. ఫైనల్ రన్ ముగిసే సరికి రూ. 50 కోట్లకు పైగా కొల్లగొట్టిందని టాక్. ఇప్పుడు ఈ ఈ సినిమా తమిళంలో రీమేక్‌కు రెడీ అవుతోంది. కోర్ట్ రీమేక్ హక్కులను ప్రొడ్యూసర్ కతిరేసన్, వెటరన్ యాక్టర్ త్యాగరాజన్ కొనుగోలు చేసారు. ప్రొడ్యూసర్ కతిరేసన్ కొడుకు కృతిక్, దేవయాని కూతురు ఇనియా తెరంగేట్రం చేయబోతున్నారని టాక్. ప్రియదర్శి క్యారెక్టర్‌ను ఒకప్పటి స్టార్ హీరో ప్రశాంత్ పోషిస్తున్నాడని టాక్. సాయి కుమార్ రోల్ త్యాగరాజన్ చేస్తున్నాడట. ఈ సినిమాను ఆయనే డైరెక్ట్ చేయబోతున్నాడన్న బజ్ నడుస్తోంది. త్వరలో అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇవ్వనున్నారట. దేవయాని డాటర్ ఇప్పటికే సరిగమపా సీజన్5లో సింగర్‌గా ఫ్రూవ్ చేసుకుంటోంది. మరి హీరోయిన్ గా ఎలాంటి గుర్తింపు తెచుకుంటుందో చూడాలి.
