Site icon NTV Telugu

డాక్టర్స్ కు సెల్యూట్ చేస్తున్న స్టార్ హీరోలు

Top Celebrities saluting to all Doctors on this National Doctors Day

నేడు “నేషనల్ డాక్టర్స్ డే”. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా డాక్టర్లకు సెల్యూట్ చేస్తున్నారు. నిజమైన హీరోలు డాక్టరేనని తెలుపుతూ స్టార్ హీరోలంతా తమ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రతి సంవత్సరం జూలై 1న “జాతీయ వైద్యుల దినోత్సవం”గా జరుపుకుంటారు. వైద్యులు మానవాళి కోసం చేస్తున్న కృషిని గుర్తిస్తూ వారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజును సెలెబ్రేట్ చేసుకుంటారు. 1991 నుండి ప్రతి సంవత్సరం జాతీయ వైద్యుల దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. ఈ రోజును ప్రపంచవ్యాప్తంగా వివిధ తేదీలలో జరుపుకుంటారు. ఇక వైద్యరంగంలో లెజెండరీ మెజీషియన్, బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ బిధన్ చంద్ర రాయ్ చేసిన కృషికి గానూ ఆయనను గౌరవించటానికి మొట్టమొదటిసారిగా ‘జాతీయ వైద్యుల దినోత్సవం’ సెలెబ్రేట్ చేశారు. కరోనా కష్టకాలంలోనూ డాక్టర్లు, నర్సులు చేసిన సేవలు అభినందనీయం. దేవుడి తరువాత ప్రాణాలు కాపాడే శక్తి ఒక్క డాక్టర్ కే ఉంటుంది. అందుకే డాక్టర్లను కూడా దేవుళ్లుగా కొలుస్తారు. ఇక మన టాలీవుడ్ టాప్ సెలెబ్రిటీలంతా ట్విట్టర్ ద్వారా డాక్టర్స్ డే శుభాకాంక్షలు పంచుకున్నారు.

Exit mobile version