NTV Telugu Site icon

Tollywood: ప్రయోగాలొద్దమ్మా.. కమర్షియల్ సినిమాలే కావాలి!

Tollywood

Tollywood

ఇప్పుడు తెలుగులో పైసా వసూల్ మూవీలన్నీ కమర్శియల్ యాంగిల్లోనే ఎక్స్ పోజ్ అవుతున్నాయి.చివరకు క్లాసీ సినిమాలు చేసుకునే నాని లాంటి హీరోలు కూడా తమ రేంజ్ పెంచుకోవడానికి దసరా,సరిపోదా శనివారం సినిమాలను కమర్షియల్ గా తీర్చిదిద్ది ఆడియన్స్ ముందుకు వచ్చాడు. తాజాగా హిట్ 3 పోస్టర్ తో ఇక ముందు కూడా అలాగే వస్తానని చెప్పకనే చెప్పేశాడు. నిజానికి బి,సి సెంటర్స్ మూమెంట్ పట్టేది కమర్శియల్ పిక్చర్సే .కలెక్షన్ రికార్డ్ లన్నీ కమర్శియల్ చిత్రాలతోనే సాధ్యం అవుతున్నాయి.ఒకవేల కమర్శియల్ ఫిలిం ఫ్లాప్ టాక్ దక్కించుకున్నా… మినిమమ్ ఓపెనింగ్స్ వస్తున్నాయి.

Kollywod: 2024లో గట్టిగా చేతులు కాల్చుకున్న కోలీవుడ్

ఇదే నిర్మాతలకు ట్రేడ్ వర్గాలకు తెగ నచ్చింది.అందుకేనేమో బెల్లంబాబు తన భైరవం సినిమాలో పక్కా మాసివ్ గెటప్ తో ఈసారి గట్టెక్కుతానని చెబుతున్నాడు. పరిశ్రమకు పైసా వసూల్ చేసి పెట్టేది ప్రస్తుతానికి కమర్శియల్ సినిమాలే అనే సూక్ష్మం దేవర,పుష్ప 2 రిజల్ట్ చూశాక మరింత స్పష్టంగా అర్ధమైంది.ఇంతకాలం ఈవిషయంలో క్లారిటీ లేకుండా మాట్లాడిన వారు ఇప్పుడు పక్కా కమర్శియల్ అయితేనే మన బొమ్మకు సేలబిలిటీ ఉంటుందనే విషయాన్ని గుర్తించారు. తారక్ అయితే ఇక తాను చేసే సినిమాలన్నీ బి,సి సెంటర్ ఆడియన్స్ ను ద్రుష్టిలో పెట్టుకునే చేయాలని చూస్తున్నాడు.అందుకు తగ్గ కథలు నేరేట్ చేసేవారికే అపాయింట్మెంట్స్ ఇస్తున్నాడట. ఆ లెక్కన చూస్తుంటే తెలుగు సినీ పరిశ్రమ ఇప్పుడు కమర్షియల్ యంగిల్ చుట్టూనే తిరుగుతోంది అని చెప్పక తప్పదు.

Show comments