NTV Telugu Site icon

Tollywood: మెగాస్టార్, పవర్ స్టార్ సినిమాల అప్ డేట్స్.. జస్ట్ వన్ క్లిక్ తోనే..

Untitled Design (20)

Untitled Design (20)

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం విశ్వంభర. మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఈ చిత్రంలోని మెగాస్టార్ ఫస్ట్ లుక్ ను రివీల్ చేశారు మేకర్స్. మరోవైపు ఈ చిత్ర ఓవర్సీస్ డీల్ క్లోజ్ చేసారు నిర్మాతలు. విశ్వంభర చిత్రాన్ని ఓవర్శిస్ ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ అయిన సరిగమ సినిమాస్, భారత్ అమెరికన్ క్రియేషన్స్ సంయుక్తంగా కొనుగోలు చేసారు. ఈ మేరకు అధికారకంగా వెల్లడించారు నిర్మాతలు. 2025 జనవరి 9న ప్రీమియర్స్ తో రిలీజ్ కానుంది విశ్వంభర.

Also Read: RamCharan: మెగా స్టార్ బర్త్ డే కానుకగా స్పెషల్ ఫోటో షేర్ చేసిన చరణ్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా OG. దాదాపు షూటింగ్ చివరిదశలో ఉండగా ఎన్నికలు రావడంతో ఈ చిత్ర షూటింగ్ ను ఆపేసాడు పవన్. తాజగా ఈ చిత్ర షూటింగ్ తిరిగి స్టార్ట్ కానుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబరు 2న పవర్ స్టార్ పుట్టిన రోజు కానుకగా వీడీయో లేదా సాంగ్ లేదా పోస్టర్ లో ఎదో ఒకటి రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేసారు మేకర్స్. అందుకు సంభందించి అనుమతి కోసం చిత్ర హీరో పవన్ కళ్యాణ్ కలిశారు నిర్మాత దానయ్య, దర్శకుడు సుజీత్

Also Read: AAY : ఏంటి.. ఆయ్ సినిమా ఇంత కలెక్ట్ చేసిందా.. వామ్మో

ప్రముఖ హాస్య నటుడు ప్రియదర్శి హీరోగా మల్లేశం, బలగం చిత్రాలతో మంచి గుర్తింపు తెచుకున్నాడు. ఇటీవల వచ్చిన డార్లింగ్ కాస్త నిరాశపరిచిన మనోడికి అవకాశాలు మాత్రం తలుపుతడుతున్నాయి. తాజగా దర్శి హీరోగా మరో చిత్రం సెట్స్ పైకి తీసుకు వెళ్ళాడు. శ్రీదేవి మూవీస్ బ్యానర్ పై మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో ఓ చిత్రం రానుంది. ఈ చిత్ర టైటిల్ ను ఈ ఆగస్టు 25న 12:15 గంటలకు రివీల్ చేయనున్నట్టు పోస్టర్ రిలీజ్ చేసారు మేకర్స్.

Show comments