Tollywood : బడ్జెట్ కవర్ చేయడానికే పార్ట్-2 ప్లాన్స్?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
షూటింగ్ సగం పూర్తియ్యాక రెండు పార్ట్స్ అంటూ అనౌన్స్మెంట్ చేయడం ఈ మధ్యకాలంలో ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. సీక్వెల్ అనౌన్స్ చేయడానికి రెండు కారణాలు ఉన్నాయి, వాటిలో అసలు కారణాన్ని కవర్ చేయడానికి మరో రీజన్ తెరపైకి తెస్తున్నారా? పార్ట్ 2 వెనుకున్న రహస్యం గురించి పెద్ద చర్చలే జరుగుతున్నాయి.
బాహుబలి కథ మూడు గంటల సినిమాతో చెప్పలేకపోయాడు రాజమౌళి. సినిమా షూటింగ్ మొదలైన తర్వాత రెండు భాగాలుగా తీయాలని నిర్ణయించుకున్నాడు, ప్రతి క్యారెక్టర్ కు ఇంపార్టెన్స్ ఉండడంతో సినిమా నిడివే ఎక్కువైంది. బాహుబలి తర్వాత రాజమౌళి తీసిన RRR హాలీవుడ్ సెలబ్రిటీస్ కు బాగా నచ్చేయడంతో సీక్వెల్ ఉంటుందని అంటున్నారు, అప్పటివరకు ఆ ఆలోచనే లేదు. ‘కాంతార’ రిలీజ్ అయి హిట్ అయిన తర్వాత కథ రెడీగా లేదు, సీక్వెల్ తీస్తే క్రేజ్ వస్తుంది.. భారీ ఓపెనింగ్స్ వస్తాయన్న ప్లాన్ ఉంది. కాంతార తర్వాత రిషబ్ శెట్టి మరోసారి రెండు పార్ట్ లతో వస్తున్నాడు. ప్రస్తుతం నటిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘ఛత్రపతి శివాజీ మహారాజ్’ బడ్జెట్ 500 కోట్లకు చేరుతుందట, ఒక పార్ట్ అంటే వర్కవుట్ కాదని బడ్జెట్ కవర్ చేయడానికి రెండు పార్ట్ లు నిర్మిస్తున్నారు.
Also Read
- AK47: వెంకీ కూతురిగా యువినా.. 'AK47' నుంచి మరో ఫన్ క్యారెక్టర్ రివీల్
- OM: ధనుష్ మాస్ అవతార్.. ‘ఓం’ ఫస్ట్ సింగిల్ వచ్చేసింది.. చూశారా.?
- Shivangi Joshi: యాక్టింగ్ నేర్పిస్తానంటూ వేధింపులు.. మేనమామ చేసిన పనికి కన్నీళ్ళు పెట్టుకున్న శివాంగి
- Allu Arjun: ‘ఐకాన్జా’తో మరో అడుగు.. హైదరాబాద్‌లో అల్లు అర్జున్ భారీ కార్పొరేట్ ప్రాజెక్ట్?
‘డ్రాగన్’ బడ్జెట్ కూడా చేయి దాటిపోయింది, మూడేళ్లు సెట్స్ పైనే ఉంటూ 2027 జూన్ 11న థియేటర్స్ లోకి రాబోతుంది. ડ్రాగన్ గ్లిమ్స్ లో రెండు పార్ట్ లుగా సినిమా వస్తుందని చెప్పలేదు, కానీ డ్రాగన్ ‘దురందర్’ ను ఫాలో అవుతున్నాడని తెలిసింది. రెండు పార్ట్ ల షూటింగ్ ఒకేసారి పూర్తి చేసి, మూడు నెలల గ్యాప్ లో దురందర్ 1, దురందర్ 2 ను రిలీజ్ చేసినట్లు.. డ్రాగన్ 2 పార్ట్స్ ను కూడా విడుదల చేస్తారట.
1996 లో వచ్చిన ‘భారతీయుడు’ కు సీక్వెల్ తీయడానికి 25 ఏళ్లు పట్టింది. ‘భారతీయుడు 2’ లెంగ్త్ ఎక్కువ కావడంతో ఓవర్ బడ్జెట్ ను కవర్ చేయడం కోసం ‘భారతీయుడు 3’ ప్రకటించారు. శంకర్ అంటేనే ఓవర్ బడ్జెట్ డైరెక్టర్. భారతీయుడు 3 బడ్జెట్ ఎక్కువైందని ‘భారతీయుడు 4’ ప్లాన్ చేస్తారేమో చూడాలి, భారతీయుడు 3 ఇప్పట్లో వచ్చేటట్టు కనిపించడం లేదు.
రెండు, మూడు పార్ట్స్ గా రిలీజ్ చేయడానికి కథ పెద్దది కావడం అనేది చాలా చిన్న రీజన్. బడ్జెట్ పెరిగిపోవడం, ఆల్రెడీ మొదటి పార్ట్ హిట్ అయితే ఈ క్రేజ్ ని క్యాష్ చేసుకోవాలి అనుకోవడంతో ఒక్కో సినిమాకు రెండు మూడు పార్ట్స్ పుట్టుకొస్తున్నాయి. ‘హరిహర వీరమల్లు’ ఐదేళ్లు సెట్స్ పై ఉండడంతో నిర్మాతకు బడ్జెట్ భారం పెరిగిపోయింది. ఒక పార్ట్ పూర్తి చేసి రిలీజ్ చేస్తే వర్కవుట్ కాదు, అందుకే రెండు పార్ట్ లు అన్న ఫార్ములాను వాడినా.. ఫస్ట్ పార్ట్ డిజాస్టర్ కావడంతో రెండో పార్ట్ కు ఛాన్స్ లేదు. ఇక ‘ఓజీ’ హిట్ కావడంతో ‘ఓజీ 2’ కు రెడీ అవుతున్నాడు పవన్.
ఇక ప్రశాంత్ నీల్ కెరీర్ అయితే సీక్వెల్స్ తో నడిచిపోతుంది. ప్రతి హీరోతోనూ సీక్వెల్ మూవీస్ ప్లాన్ చేయడంతో ప్రశాంత్ నీల్ పై సీక్వెల్ ముద్ర పడిపోయింది. కేజీఎఫ్ సిరీస్ ‘కేజీఎఫ్ 2’ తో అయిపోతుంది అనుకుంటే, క్లైమాక్స్ లో మూడో పార్ట్ ఉంటుందని చెప్పి షాక్ ఇచ్చాడు. ప్రశాంత్ నీల్ నుంచి ఏ సినిమా వచ్చినా రెండు మూడు పార్ట్లు ఉంటాయని ఫిక్స్ అయిపోవాల్సిందే. ‘సలార్’ టీజర్ రిలీజ్ అయ్యే వరకు సినిమా రెండు పార్ట్‌లుగా వస్తుందని తెలియదు. ఒక పార్ట్ పూర్తి చేయడానికే రెండు మూడేళ్లు తీసుకున్నారంటే ఆటోమేటిక్ గా పార్ట్ 2 ఉన్నట్టే లెక్క. ‘రాజు సభ’ను ఒక పార్ట్ తో మొదలుపెట్టి, బడ్జెట్ ఎక్కువైపోయిందన్న సాకుతో రెండో పార్ట్ ను ప్రకటించారు. ఫస్ట్ పార్టే చేతులెత్తేయడంతో, సీక్వెల్ కథ కంచికి చేరినట్టే.
తాజావార్తలు
-
JP Nadda: “ఉద్యమాల్లో పాల్గొంటే పోలీసు దెబ్బలకు సిద్ధపడాల్సిందే”.. సీజేపీ నిరసనపై జేపీ నడ్డా ఫైర్
-
రూ.2 లక్షల కోట్లకు చేరువలో IPL.. బ్రాండ్ విలువలో నెం.1గా RCB..
-
AK47: వెంకీ కూతురిగా యువినా.. ‘AK47’ నుంచి మరో ఫన్ క్యారెక్టర్ రివీల్
-
AI ఫీచర్లు, Intel Core Ultra ప్రాసెసర్లతో Dell XPS 13, Dell 14S, Dell 16S, Alienware 15 ల్యాప్‌టాప్‌లు లాంచ్..!
-
Kasturba Girls School: విద్యార్థినులతో మసాజ్ చేయించుకున్న టీచర్.. వైరల్ ఫోటోలతో కలకలం.. విచారణకు ఆదేశాలు!
ట్రెండింగ్
-
Subhadeep Ghosh: టీమిండియా కొత్త కోచ్‌గా మాజీ క్రికెటర్.. ఎవరీ సుభదీప్ ఘోష్?.. అంత తోపా!
-
Womens Shave Heads: విక్రమార్కుడు మూవీ సీన్ రిపీట్.. డబ్బు కోసం గుండు కొట్టించుకున్న మహిళలు.. చివరలో ఊహించని ట్విస్ట్!
-
200MP డ్యూయల్ కెమెరాలు, ARRI సినిమా టెక్నాలజీతో రానున్న HONOR Robot Phone..!
-
Kitchen Hacks : వంటగది స్విచ్బోర్డులపై జిడ్డు, నూనె మరకలా? ఈ చిట్కాలతో 5 నిమిషాల్లో క్లీన్..!
-
Cashew Nuts Price : రూ. 1,000 జీడిపప్పు.. రూ. 300కే ఎక్కడ దొరుకుతుందో తెలుసా.?