NTV Telugu Site icon

Tollywood : వినాయక చవితి కానుకగా టాలీవుడ్ స్పెషల్ అప్ డేట్స్..

Untitled Design (23)

Untitled Design (23)

వినాయక చవితి కానుకగా విషెస్ తెలుపుతూ షూటింగ్ దశలో ఉన్న సినిమాలు పోస్టర్స్ రిలీజ్ చేయగా, యంగ్ హీరోలు తమ నూతన సినిమాలను ప్రకటించారు మేకర్స్.  అవేంటో ఒకేసారి చూసేద్దాం పదండి..

1 – వినాయక చవితి కానుకగా తన నెక్ట్స్ సినిమాలను ప్రకటించాడు శర్వానంద్.  ఈ నెల శర్వా 37 సినిమా లో హీరోయిన్ సంయుక్త మీనన్ పోస్టర్ ఈ నెల 11న రిలీజ్ చేయబోతున్నారు మేకర్స్ .

2 – మత్తువదలరా – 2 సినిమా సెన్సార్ సభ్యుల నుండి U/A సర్టిఫికెట్  అందుకుంది. ఈ నెల 13న రిలీజ్ కానుంది ఈ చిత్రం

3 – చిన్నసినిమాగా రిలీజ్ అయిన కమిటీ కుర్రోళ్ళు భారీ కలెక్షన్స్ రాబట్టి 5వ వారంలోకి అడుగుపెట్టి థియేటర్స్ లో రన్ అవుతోంది

4 – నార్నె నితిన్ హీరోగా వచ్చిన ఆయ్ ఈ నెల 12 నుండి ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది

5 – దేవర సినిమాలోని ఆయుధ పూజ సాంగ్ ను ముందుగా రిలీజ్ చేయకుండా డైరెక్ట్ గా సినిమాలోనే చూపించాలని భావిస్తున్నారట మేకర్స్

6 – సుహాస్ హీరోగా తెరకెక్కిన జనక అయితే గనుక పోస్ట్ పోన్ అయిన సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమాను అక్టోబర్ లో దసరాకు రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు నిర్మాత దిల్ రాజు

7 – ఇటీవల రిలీజ్ ఆయిన దేవరలోని దావూదీ సాంగ్ సినిమాలో ఉండదని రోలింగ్ టైటిల్స్ లో వస్తుందని తెలుస్తోంది.