NTV Telugu Site icon

Tollywood : టుడేస్ టాలీవుడ్ ట్రేండింగ్ న్యూస్.. ఒక్క క్లిక్ లోనే…

Untitled Design 2024 08 09t141448.895

Untitled Design 2024 08 09t141448.895

అఖిల్ హీరోగా వచ్చిన ఏజెంట్ సినిమా గుర్తుండే ఉంటుంది. భారీ బడ్జెట్ లో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా టాలీవుడ్ డిజాస్టర్ లలో ఒకటిగా నిలిచింది. కాగా ఈ రిలీజ్ అయి ఏడాది దాటినా కూడా ఇంత వరకు ఓటీటీ లో రిలీజ్ కాలేదు. అప్పట్లో ఈ సినిమా రైట్స్ అత్యధిక ధరకు కొనిగొలు చేసింది సోనీలివ్. కానీ ఇప్పటికి స్ట్రీమింగ్ చేయలేదు. వినిపిస్తున్న సమాచారం మేరకుఈ సినిమా నెట్ ఫ్లిక్స్ లో అతి త్వరలో స్ట్రీమింగ్ కానున్నటు తెలుస్తోంది.

Also Read: RamCharan 16: రామ్ చరణ్, బుచ్చిబాబు మూవీ షూటింగ్ ఎప్పుడంటే..?

రవితేజ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రానున్న సినిమా మిస్టర్ బచ్చన్. ఈ సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ. తాజాగా మరొక న్యూస్ టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తోంది. ఈ సినిమాలో సిద్దూ తో పాటు రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్ కూడా గెస్ట్ రోల్ లో కనిపించనున్నాడు. సినిమాలో కీలకంగా వచ్చే సన్నివేశంలో దేవి కనిపించబోతున్నాడని యూనిట్ సభ్యుల నుండి సమాచారం అందుతోంది. ఆగస్టు 15న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కానుంది మిస్టర్ బచ్చన్.

Also Read: NTRNeel: తారక్ – ప్రశాంత్ నీల్ రిలీజ్ డేట్ వచ్చేసింది.. ఎప్పుడంటే..?

సిద్దార్ధ్ హీరోగా, జెనీలియా హీరోయిన్ గా 2006లో వచ్చిన సినిమా బొమ్మరిల్లు. భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఏ విధమైన అంచనాలు లేకుండా వచ్చిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించింది. హాసిని పాత్రలో జెనీలియా నటన, తండ్రి చాటు బిడ్డగా సిద్దూ అభినయం, దేవిశ్రీ సాంగ్స్ ఒక ఊపు ఊపేసాయి. ముఖ్యంగా ప్రేమికులకు ఈ సినిమా ఒక తీపి జ్ఞాపకం. కాగా నేటికి బొమ్మరిల్లు రిలీజ్ అయి 18 ఇయర్స్ అయిన సందర్బంగా పోస్టర్ రిలీజ్ చేసారు నిర్మాత దిల్ రాజు.

Show comments